మలహార్ మండలంలో ఇద్దరమ్మాయిలు ఎస్సైగా ఎంపిక
భూపాలపల్లి జిల్లా:ఆగస్టు 07: సివిల్ ఎస్సై ఫలితాల్లో తాడిచర్ల మల్హర్ మండలంలోని, ఆన్ సాన్ పల్లి గ్రామానికి చెందిన బానోత్ గీత, చిన్నతూoడ్ల గ్రామానికి చెందిన నారా రుచిత్ర, అనే ఇద్దరు అమ్మాయిలు ఆదివారం వెలువడిన ఫలితాల్లో ఎస్సైగా ఎంపికయ్యారు. వ్యవసాయ కుటుంబం నుంచి ఈ ఇద్దరు అమ్మాయిలు ఆణిముత్యాలుగా నిలిచారు.
బానోత్ గీత తల్లిదండ్రులు సమ్మయ్య లలిత వ్యవసాయ కుటుంబం, నారా సుచిత్ర తల్లిదండ్రులు రామయ్య వీఆర్ఏ గా చేస్తూ భార్య లక్ష్మి వ్యవసాయ పనులకు వెళ్తూ అమ్మాయిలను పై చదువులు చదివించి ఎస్సై ఉద్యోగంలో ఎంపికయ్య విధంగా ప్రోత్సహించారు.
ఇద్దరమ్మాయిలు ఎస్సైలుగా ఎంపిక కావడం తల్లిదండ్రుల కన్న కలలను సాకారం చేశారు.దీంతో వారి తల్లిదండ్రులు ఆనందంలో మునిగితేలుతూ బిడ్డలను హత్తుకున్నారు లక్ష్యాన్ని నెరవేర్చారని అభినందించారు…



