ఏకలవ్య మోడల్ స్కూళ్లలో 6329 పోస్టులు

దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (ఈఎంఆర్‌ఎస్)లో వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ (ఈఎస్‌ఎస్‌ఈ-2023 నోటిఫికేషన్‌ను నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 6329
పోస్టుల వారీగా ఖాళీలు
టీజీటీ-5660
టీజీటీలో సబ్జెక్టుల వారీగా ఖాళీలు
హిందీ- 606
ఇంగ్లిష్-671
మ్యాథ్స్-686
సోషల్ స్టడీస్-670
సైన్స్-678
టీజీటీ థర్డ్ లాంగ్వేజ్-652 👉 (తెలుగు- 102)
టీజీటీ మిస్‌లీనియస్ కేటగిరీ
మ్యూజిక్ – 320
ఆర్ట్ – 342
పీఈటీ (మేల్)- 321
పీఈటీ (ఫిమేల్)- 345
లైబ్రేరియన్ – 369
మొత్తం ఖాళీలు: 1697
నాన్ టీచింగ్ పోస్టులు
హాస్టల్ వార్డెన్ (మేల్)- 335
హాస్టల్ వార్డెన్ (ఫిమేల్)-334
మొత్తం ఖాళీలు: 669
అర్హతలు: ఆర్‌ఐఈలో నాలుగేండ్లు ఇంటిగ్రేటెడ్ డిగ్రీ లేదా సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ ఉత్తీర్ణత. బీఈడీ ఉత్తీర్ణత. దీనితోపాటు సీటెట్‌లో అర్హత సాధించి ఉండాలి.
హాస్టల్ వార్డెన్ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణత. మిగిలిన పోస్టుల అర్హతల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
ఎంపిక:
ఎగ్జామ్ (ఆబ్జెక్టివ్ టైప్) – 120 మార్కులకు
లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ – 30 మార్కులకు
ఈ పరీక్షలో జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్ ఎబిలిటీ, నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ, టీచింగ్ ఆప్టిట్యూడ్, డొమైన్ నాలెడ్జ్, లాంగ్వేజ్ కాంపిటెన్సీపై ప్రశ్నలు ఇస్తారు.
💥హాస్టల్ వార్డెన్
జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్ ఎబిలిటీ, నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ, నాలెడ్జ్ ఆఫ్ పోక్సో, అడ్మినిస్ట్రేటివ్ ఆప్టిట్యూడ్, లాంగ్వేజ్ కాంపిటెన్సీ జనరల్ హిందీ, జనరల్ ఇంగ్లిష్, రీజనల్ లాంగ్వేజ్‌పై పరీక్ష నిర్వహిస్తారు.
నోట్: పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కులు కోత విధిస్తారు.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: ఆగస్టు 18
ఫీజు: టీజీటీ పోస్టుకు రూ.1500/-,
హాస్టల్ వార్డెన్ పోస్టుకు రూ.1000/-
వెబ్‌సైట్: www.emrs.tribal.gov.in



