Wednesday, March 4, 2026

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ తుది దశకు…  

- Advertisement -
MSET Counseling is at the final stage...
MSET Counseling is at the final stage…

ఇంజనీరింగ్ లో మిగిలిపోయిన 19 వేల సీట్లు

హైదరాబాద్,, ఆగస్టు9, వాయిస్ టుడే: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ తుది దశకు చేరుకుంది. కన్వినర్‌ కోటా కింద తుదిదశ ఇంజనీరింగ్‌ సీట్ల కేటాయింపు జరగనుంది. మొత్తం 19 వేల సీట్లను వివిద బ్రాంచులకు కేటాయించాల్సి ఉంది. కన్వినర్‌ కోటా కింద 82,666 ఇంజనీరింగ్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో తొలి విడతలో 70,665 మందికి సీట్లు కేటాయించారు. తొలి విడత కౌన్సెలింగ్‌లో మిగిలిన 12,013 సీట్లతోపాటు రిపోర్టు చేయకపోవడం వల్ల మిగిలిపోయిన 18 వేల సీట్లతో కలిపి మొత్తం 30,013 సీట్లను రెండో విడతలో కేటాయించారు.

MSET Counseling is at the final stage...
MSET Counseling is at the final stage…

ఐతే రెండో విడత కౌన్సెలింగ్‌లోనూ 12 వేల సీట్లు మిగిలిపోయాయి. రెండో విడతలో సీట్లు పొందినా 7 వేల మంది వరకూ విద్యార్ధులు ఆయా కాలేజీల్లో చేరలేదు. దీంతో తుది విడత కౌన్సెలింగ్‌కు మొత్తం 19 వేల వరకూ సీట్లు ఖాళీగా ఉన్నాయి. తాజాగా జరిగిన తుది విడతలో సీట్లు పొందిన విద్యార్ధులు ఆగస్టు10 నుంచి 12లోగా సంబంధిత కాలేజీల్లో స్వయంగా రిపోర్టు చేయాల్సి ఉంటుంది. లేదంటే సీటు రద్దవుతుంది. తుది విడతలో మిగిలిపోయిన సీట్లకు ఆగస్టు17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్‌ జరగనుంది. జోసా కౌన్సెలింగ్‌లో ఎన్‌ఐటీ, ఐఐటీ సీట్ల కేటాయింపు ప్రక్రియ కూడా పూర్తయ్యింది. కాబట్టి వాటిల్లో సీట్లు పొందని వారికి ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందే అవకాశం ఉంటుంది. స్పెషల్‌ కౌన్సెలింగ్‌ ఆప్షన్ల ప్రక్రియ పూర్తయ్యాక ఆగస్టు 23న సీట్ల కేటాయింపు ఉంటుంది.  సీట్లు పొందినవారు ఆగస్టు 25లోగా కాలేజీల్లో నేరుగా రిపోర్టు చేయాలి. ఒక కాలేజీలో తుది విడత కౌన్సెలింగ్‌లో ఏదైనా బ్రాంచీలో సీటు వచ్చి ప్రత్యేక కౌన్సెలింగ్‌లో వేరొక బ్రాంచీలో సీటు వస్తే కేటాయింపు పత్రాన్ని సమర్పించి సీటు మార్పించు కోవాలి. అప్పటికే వేరే కాలేజీలో సీటు వచ్చి ఉంటే అక్కడ టీసీ, సర్టిఫికెట్లను తీసుకుని ప్రత్యేక కౌన్సెలింగ్‌లో సీటు వచ్చిన కాలేజీలో ఈ నెల 25లోగా రిపోర్టు చేయాలి. ఇక యాజమాన్య కోటా సీట్ల కేటాయింపుపై ఉన్నత విద్యామండలి దృష్టి సారించింది. ప్రత్యేక కౌన్సెలింగ్‌ పూర్తయ్యేలోగా యాజమాన్య కోటా సీట్లకు సంబంధించిన వివరాలను ప్రైవేటు కాలేజీలకు పంపించేలా అధికారులు  ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి కాలేజీలోనూ 30 శాతం యాజమాన్య కోటా ఉంటుంది కాబట్టి వీటిల్లో 15 శాతం సీట్లను నిబంధనల ప్రకారం భర్తీ చేయాలి. మిగిలిన 15 శాతం సీట్లను ఎన్‌ఆర్‌ఐ సిఫార్సులకు కేటాయిస్తారు. జేఈఈ, ఎంసెట్‌ ర్యాంకు, ఇంటర్‌ మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్