Thursday, December 12, 2024

కేసీఆర్ మెదక్ టూర్ వాయిదా

- Advertisement -
KCR Medak tour postponed
KCR Medak tour postponed

హైదరాబాద్,  ఆగస్టు 16: మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన వాయిదా పడింది. ఈ నెల 19న మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించాల్సి ఉంది. అయితే ఆ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఈ నెల 23కు వాయిదా పడిందని బీఆర్ఎస్ శ్రేణులు వెల్లడించారు. కాగా.. సూర్యాపేట పర్యటన మాత్రం యదావిధిగా కొనసాగుతుందని తెలిపారు. సూర్యపేటలో 20న, మెదక్ లో 23న పర్యటించనున్నట్లు బీఆర్ఎస్ శ్రేణులు క్లారిటీ ఇచ్చారు.తెలంగాణ సీఎం కేసీఆర్ మెదక్, సూర్యాపేట జిల్లాల పర్యటన ఖరారు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఆగస్టు చివరి వారం నుంచి రెండు జిల్లాల్లో పర్యటించి బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. ఈ సమావేశాల ద్వారా ఎన్నికల వాతావరణాన్ని సృష్టించాలన్నది గులాబీ బాస్ ప్లాన్ గా తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు ముందే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు నెలాఖరులోగా మెదక్ జిల్లా, సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పలు బహిరంగ సభల్లో పాల్గొనేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా.. తన బహిరంగ సభల ద్వారా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఎండగట్టాలన్నది సీఎం కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది.

సూర్యాపేట జిల్లాలో..

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు 20న సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు.ఈ పర్యటనలో భాగంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.. అనంతరం నూతనంగా నిర్మించిన ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఇదే సందర్భంగా నూతనంగా నిర్మించిన మెడికల్ కళాశాలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల అనంతరం సూర్యాపేటలో నూతనంగా నిర్మించిన బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు

మెదక్ జిల్లాలో..

ఆగస్టు 23న మెదక్ జిల్లాలో కలెక్టర్ కార్యాలయం, జిల్లా పోలీసు (ఎస్పీ) కార్యాలయాన్ని ప్రారంభించే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. సమావేశానికి ముందు జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే గులాబీ అధినేత పాల్గొనే సభ నిర్వహణలో మెదక్ జిల్లా నేతలు నిమగ్నమయ్యారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపడతున్నారు. కాగా, సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో అన్ని జిల్లాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో మెదక్ జిల్లా నుంచి భారీగా జనసమీకరణ చేస్తున్నారు.

ఆగస్టు 19 న కేసీఆర్  మెదక్ జిల్లా పర్యటన

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్