ఆర్ఆర్ఆర్ కు జాతీయ అవార్డుల పంట

- Advertisement -
A harvest of national awards for RRR
A harvest of national awards for RRR

హైదరాబాద్: అంతర్జాతీయ వేదికలపై ఎన్నో అరుదైన అవార్డులను అందుకున్న ఆర్ఆర్ఆర్..  ఈ ఏడాది జాతీయ అవార్డుల్లో కూడా తన సత్తా చాటింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 విభాగాల్లో నిలిచి మరోసారి తెలుగోడి సత్తాను ఇండస్ట్రీకి పరిచయం చేసింది.

బెస్ట్ కొరియోగ్రాఫర్ గా ప్రేమ్ రక్షిత్ ఎన్నికవ్వగా.. బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ గా కాల భైరవ నిలిచాడు. తెలుగు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా ఉప్పెన ఇక బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా కీరవాణి ఎన్నికవ్వగా.. బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ విభాగంలో స్టంట్ కొరియోగ్రఫీ గా కింగ్ సోలోమన్ ఎంపిక అయ్యాడు. ఇక బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ప్రోవైడింగ్ హోల్సమ్ ఎంటర్ టైన్మెంట్ కేటగిరిలో ఆర్ఆర్ఆర్ నిలిచింది. అంతేకాకుండా బెస్ట్ స్పెషల్ ఎఫక్ట్ విభాగంలో శ్రీనివాస్ మోహన్ ను జాతీయ అవార్డు వరించింది. ఇక ఇదే సినిమాలో సీతగా నటించిన అలియా భట్ కు కూడా అవార్డు వరించింది. ఆమె బాలీవుడ్ లో నటించిన గంగూభాయ్ కతీయావాడి సినిమాకు గాను ఉత్తమ నటి అవార్డును అందుకుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular