GHMC కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మెకు మద్దతు పలికిన ఎమ్మెల్యే మొవ్వా

- Advertisement -
MLA Movwa supports the strike of GHMC contract employees
MLA Movwa supports the strike of GHMC contract employees

GHMC కాంట్రాక్టు ఉద్యోగులు తలపెట్టిన  నిరవధిక సమ్మెకు బీజేపీ తరుపున సంఘీభావం  తెలిపిన  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,కంటెస్టెంట్ ఎమ్మెల్యే మొవ్వా సత్యనారాయణ గారు…..

శేరిలింగంపల్లి నియోజకవర్గం, చందానగర్ GHMC కార్యాలయం నందు జిహెచ్ఎంసి లో విధులు నిర్వహిస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన కార్మిక సంఘాలకు మద్దతు పలికిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,కంటెస్టెడ్ ఎమ్మెల్యే మొవ్వా సత్యనారాయణ గారు…

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ….  ఈ పేదల గోస కానరాట్లేదా బిఆర్ఎస్ ప్రభుత్వ అధికారులరా,ఇంకా ఎన్ని రోజులు ఇలా పేదల జీవితాలతో ఆడుకుంటారు. తెలంగాణ స్వరాష్ట్రంలో వారి కోరికలు కలలుగానే  మిగిలిపోయాయి అని ఆందోళన వ్యక్తం చేసారు.తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ కాంట్రాక్టు ఉద్యోగాన్ని పర్మినెంట్ చేస్తామని చెప్పి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక కనీసం పట్టించుకోని ఈ బి ఆర్ ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపేవరకు నిద్రపోమని అన్నారు.

 జిహెచ్ఎంసి పరిధిలో ఈరోజు ప్రజలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా  జీవిస్తున్నారంటే దానికి GHMC ఉద్యోగులే కారణమని మరియు ఈ ఉద్యోగులు ఒక్కరోజు  పని మానేసి ఇంట్లో కూర్చుంటే ఈ యొక్క మహానగరం, అని చెబుతున్న ఈ బిఆర్ఎస్  నాయకులు రోడ్ల పై తిరగగలరా అని ప్రశ్నించారు…..

మీరు కచ్చితంగా GHMC కాంట్రాక్టు ఉద్యోగులను మరియు డబల్ బెడ్ రూమ్ ఇళ్ల అర్హులకు మీరు వెంటనే న్యాయం చేయాలి లేకపోతే దీని పైన తగిన చెర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని తెలియజేయడం జరిగింది.

  ఈ కార్యక్రమంలో బోయిని మహేష్ యాదవ్ గారు,పవన్ గారు ,బీజేపీ రాష్ట్ర నాయకులు,జిల్లా నాయకులు,డివిజన్ నాయకులు,ఇతర నాయకులు,కార్యకర్తలు పాల్గొనడము జరిగింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular