ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
చేర్యాల: చేర్యాలలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అయన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసారు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడుతూ ఈ మధ్య పల్లా రాజేశ్వర్ రెడ్డి డబ్బు సంచులతో స్థానిక నాయకులను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి చేష్టలు ముఖ్యమంత్రి సంకల్పానికి విరుద్ధం. వేరే పార్టీల నుండి వచ్చిన ఎమ్మెల్యేలను కుక్కలతో పోల్చిన పల్లా రాజేశ్వర్ రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలని అన్నారు.
జనగామ నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని చెప్పడం ముఖ్యమంత్రి కేసిఆర్ పరిపాలన దక్షతను కించపరిచినట్లే. నియోజకవర్గం మీద,స్థానిక నాయకుల మీద సోయి లేని నువ్వు నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తవా. రెండు సార్లు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా స్వంత ఖర్చులతో భోజనాలు పెట్టీ నిన్ను గెలిపించిన, కానీ 70కోట్ల ఖర్చు పెట్టిన అని చెప్పడం సిగ్గు చేటని అన్నారు. ఖర్ధార్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, నీ డబ్బు రాజకీయాలకు ప్రజలే బుద్ధి చెప్తరు. ప్రతిపక్షాలకు సవాల్ విసురుతున్న, ముత్తిరెడ్డి నియోజకవర్గంలో ఎక్కడ కబ్జా చేసిండో నిరూపిస్తే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని అన్నారు.



