3రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా “ఫైట్ మహా” మూవీ టీజర్ లాంఛ్
“Fight Maha” movie teaser launched by Ram Gopal Varma.
సునీల్, అఖిల్ ఉడ్డెమారి, డా. శ్రీవాణి గోపిచంద్, వైష్ణవి, సిద్ధార్థ్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా “ఫైట్ మహా”. కలలు నిజమైతే నిజం ఎవరిది అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు ఆనంద్ చంద్ర. న్యూ ఐ మూవీస్ ఎల్ ఎల్ పీ బ్యానర్ పై ఏవీఎస్ రాజు, ఆర్ కుమార్ రాజు, ఆనంద్ చంద్ర నిర్మిస్తున్నారు. హైదరాబాద్, వైజాగ్, కేరళ లలో షూటింగ్ జరుపుకుని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ ను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకులు వంశీ, దర్శకుడు స్క్రిప్ట్ రైటర్ బీవీఎస్ రవి, పాటల రచయిత సిరాశ్రీ ఆర్జీవి సోదరి శ్రీమతి విజయ, దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ళ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా….
ప్రొడ్యూసర్ ఏవీఎస్ రాజు మాట్లాడుతూ – దర్శకుడు ఆనంద్ చంద్ర ఈ కథ చెప్పినప్పుడు మా అందరికీ బాగా నచ్చింది. కథే ఈ సినిమా నిర్మించేందుకు మమ్మల్ని ఇన్స్ పైర్ చేసింది. డైరెక్టర్ మాకు కథ ఎంత బాగా చెప్పాడో అంతే బాగా రూపొందించాడు. వైజాగ్, కేరళ, హైదరాబాద్ లో ఈ సినిమాను చిత్రీకరించాం. అన్నారు.
డైరెక్టర్ ఆనంద్ చంద్ర మాట్లాడుతూ -‘ఫైట్ మహా’ ఒక వినూత్నమైన సైకాలజికల్ థ్రిల్లర్. కలలు, మానసిక రుగ్మత, విధి, అపరాధ భావన, దాగి ఉన్న నిజాల చుట్టూ తిరిగే ఈ కథ ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠలో ఉంచుతుంది. మహా అనేది మా మూవీలో మెయిల్ లీడ్ క్యారెక్టర్ పేరు. ఆయన తన లైఫ్ తో ఫైట్ చేస్తుంటాడు. అందుకే ఫైట్ మహా అనే టైటిల్ మా మూవీకి పెట్టాం. జీవితంలో నిరాశతో ఏదీ వదిలిపెట్టవద్దు, పోరాడుతూనే ఉండాలి అనే మంచి విషయాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నాం. సైకలాజికల్ థ్రిల్లర్, డ్రామా జానర్ లో మా సినిమా రూపొందించాం. అన్నారు.
రైటర్ బీవీఎస్ రవి మాట్లాడుతూ – ఫైట్ మహా సాంగ్స్ ను గతంలో ఈ ప్రొడ్యూసర్స్ చూపించారు. పాటలు చాలా బాగున్నాయి. టీజర్ బాగుంది. ఈ రోజుల్లో ఇలాంటి కాన్సెప్ట్ మూవీస్ నే ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.
లిరిక్ రైటర్ సిరాశ్రీ మాట్లాడుతూ – ఫైట్ మహా సినిమా టీజర్ బాగుంది. టీజర్ చూస్తే ట్రైలర్ చూడాలనే క్యూరియాసిటీ క్రియేట్ అవుతోంది. అలాగే ట్రైలర్ తో సినిమా చూసే ఇంట్రెస్ట్ కలగాలి. టీజర్ తోనే ఈ టీమ్ మనల్ని ఆకట్టుకున్నారు. అన్నారు.
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ – శివ సినిమాలో స్టడీ కెమెరా షాట్స్ కు నాకు మంచి పేరొచ్చింది. అయితే స్టడీ కెమెరాలు రాకముందే డైరెక్టర్ వంశీ గారు అన్వేషణ మూవీలో నాకంటే బాగా సీన్స్ రూపొందించారు. ఫైట్ మహా లో చూపించిన స్లీప్ వాకింగ్ అనే కాన్సెప్ట్ చాలా యూనిక్ గా ఉంది. అక్కడక్కడా ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమాలు వచ్చి ఉండొచ్చు. కానీ మన ప్రేక్షకులకు మాత్రం ఈ కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది. ఆనంద్ డైరెక్టర్ గా బాగా సినిమాను తెరకెక్కిస్తాడని తెలుసు. ఎమోషన్, థ్రిల్ వంటి ఎలిమెంట్స్ ను అతను బాగా డీల్ చేశాడని అనుకుంటున్నా. ట్రైలర్ కోసం వేచి చూస్తున్నా. అన్నారు.
నటీనటులు – సునీల్, అఖిల్ ఉడ్డెమారి, డా. శ్రీవాణి గోపిచంద్, వైష్ణవి, సిద్ధార్థ్, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, దీపక్ కేశవ్, కృష్ణంరాజు (జోగి బ్రదర్స్), జబర్దస్త్ శాంతి కుమార్, ఆయేషా, హరీష్, పూర్ణ శ్రీ, మాస్టర్ రోహన్, మాస్టర్ జొన్న, హేమంత్ బాలాజీ, పద్మ వెంకట్, కందకట్ల, లక్ష్మి, సుమ రెడ్డి, నాగురిశ్లోకం, అభ భాయి జి. కల్యాణ్, మహేంద్రనాథ్, శ్రీ, పి.రామచంద్ర రాజు, ఏవీఎస్ రాజు, రోహిత్ కన్న, మధు యాదవ్, దాసరి శ్రుతి, అర్జున్, ఎం సీతరామశాస్త్రి, భవానీ శంకర్, మంజుల రాథోడ్
3రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా “ఫైట్ మహా” మూవీ టీజర్ లాంఛ్

- Advertisement -
- Advertisement -



