హుస్నాబాద్  నుండి  పొన్నం కాంగ్రెస్ అభ్యర్థి గా…?

- Advertisement -

హుస్నాబాద్ నియోజకవర్గానికి ఏ అభివృద్ధి పనులు చేశానో చెప్పడానికి చర్చకు సిద్ధం…

మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం నుండి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బరిలో ఉంటారని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ మేరకు హుస్నాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ శ్రేణులతో కలిసి మాట్లాడారు. సిపిఐ తో పార్టీ అధిష్టానం చర్చలు జరుపుతుందనే విషయమై హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు ఆందోళన పడద్దని భరోసానిచ్చారు. గెలుపోటములు బేరిజు వేసుకున్న తర్వాతే సీట్లను కేటాయించుకోవడం జరుగుతుందన్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిగా , ప్రజల ఆకాంక్ష మేరకే హుస్నాబాద్ నియోజకవర్గం నుండి పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular