చీన్ టపాక్ డమ్ డమ్’ మూవీ ఫస్ట్ క్రాకర్ ఆవిష్కరించిన అడివి శేష్
Adivi Sesh unveils the ‘first cracker’ of the movie ‘Cheen Tapak Dum Dum’.
అల్లరి, సరదా, నవ్వులతో ప్రేక్షకులను అలరించేందుకు ‘చీన్ టపాక్ డమ్ డమ్’ సిద్ధమవుతోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ ఎంటర్టైనర్కు సంబంధించిన ఫస్ట్ క్రాకర్‌ను హిట్ మెషీన్ అడివి శేష్ ఆవిష్కరించారు. ఈ ఫస్ట్ క్రాకర్ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది.
గవిరెడ్డి శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రానికి వై.ఎన్.లోహిత్ దర్శకత్వం వహిస్తున్నారు. విలేజ్ టాకీస్ బ్యానర్‌పై శ్రీను నాగులపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిలేరియస్ సన్నివేశాలు, ఆసక్తికరమైన పల్లెటూరి నేపథ్యంతో ఈ సినిమా ఆద్యంతం వినోదాన్ని పంచే ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. ఇక మోషన్ పోస్టర్‌లోని “కాన్ సెన్స్ క్రౌన్స్ వెన్ కామన్ సెన్స్ డ్రౌన్స్’ అనే క్యాప్షన్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ..సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
ఆసక్తికరంగా రూపొందించిన మోషన్ పోస్టర్ జొన్నాడ గ్రామంలోని వింత ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది. ఇందులో గేదె, గ్రామ దేవత, బంగారం వంటి ఆసక్తికరమైన అంశాలతో పాటు మరెన్నో ఆసక్తిని రేకెత్తించే విషయాలు కనిపిస్తున్నాయి. కథను పూర్తిగా వెల్లడించకుండా, గ్రామంలోని పాత్రలు, అక్కడ చోటుచేసుకునే విచిత్ర పరిణామాలపై ఆసక్తిని పెంచేలా ఈ పోస్టర్‌ను రూపొందించారు. గవిరెడ్డి శ్రీనివాస్ లుక్ కూడా మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. సినిమాలో జరిగే అల్లరి, గందరగోళానికి ఆయన పాత్రే కేంద్రబిందువుగా ఉండబోతుందనేలా లుక్ ఉంది.
వినూత్నమైన నేపథ్యం, ఆసక్తికరమైన విజువల్స్‌తో రూపొందిన ఈ మోషన్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఆద్యంతం వినోదాన్ని పంచుతూ, కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలతో ప్రేక్షకులను అలరించే సినిమా రానున్నట్లు మోషన్ పోస్టర్ చూస్తుంటే తెలుస్తోంది. గవిరెడ్డి శ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో బ్రిగిడా సాగా కథానాయికగా నటిస్తున్నారు. షఫీ, దువ్వాడ మాధురి, గోపరాజు రమణ, సురభి ప్రభావతి, గోపరాజు విజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఏ.ఎస్. ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. పి.ఆర్. సంగీతం అందిస్తుండగా, సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వినూత్నమైన టైటిల్, ఆసక్తికరమైన పల్లెటూరి నేపథ్యం, విభిన్నమైన పాత్రలు, గవిరెడ్డి శ్రీనివాస్ డిఫరెంట్ లుక్‌తో ‘చీన్ టపాక్ డమ్ డమ్’ మంచి కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేస్తోంది.
‘ఫస్ట్ క్రాకర్’ జొన్నాడ గ్రామంలో సాగే అల్లరి, సరదాలతో నిండిన ప్రపంచాన్ని పరిచయం చేస్తూ, సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. అసలు జొన్నాడ గ్రామంలో ఏం జరుగుతుంది? అనే క్యూరియాసిటీతో ప్రేక్షకులు సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నటీనటులు:
గవిరెడ్డి శ్రీనివాస్, బ్రిగిడా సాగా, షఫీ, దువ్వాడ మాధురి, గోపరాజు రమణ, సురభి ప్రభావతి, గోపరాజు విజయ్ తదితరులు
చీన్ టపాక్ డమ్ డమ్’ మూవీ ఫస్ట్ క్రాకర్ ఆవిష్కరించిన అడివి శేష్

- Advertisement -
- Advertisement -



