ఆకాశంలో సూపర్ బ్లూ మూన్ కను విందు చేసింది. రోజూ వచ్చే చంద్రుడి లాగా కాకుండా జాబిల్లి పెద్దగా, అత్యం త కాంతివంతంగా కనిపించింది. భూ మికి అత్యంత సమీపానికి చంద్రుడు వచ్చినపుడు పౌర్ణమి రావడంతో ఆకాశంలో ఈ అద్భుతమైన సూప ర్ బ్లూ మూన్ అద్భుతం ఆవిష్కృతం అవుతుంది. భూ మికి 3.57 లక్షల కిలోమీటర్ల దూరంలో చంద్రుడు దర్శ నం ఇచ్చాడు. ఈ క్రమంలో జాబిల్లి నిండైన రూపం లో పెద్దగా సాధారణం కంటే మరింత ప్రకా శవంతంగా కని పించింది. దీన్ని సూపర్ మూన్ అని పిలుస్తారు. అంతే కాకుండా ఒకే నెలలో ఇలా రెండోసారి కనిపించే సూప ర్ బ్లూ మూన్ పరిణామం చోటు చేసుకోనుంది. అయి తే బ్లూ మూన్ అంటే చంద్రుడు బ్లూ కలర్లో కనిపిం చడు. నారింజ రంగులో చందమామ కనిపిస్తుంది. ఆగస్టు 1న తొలి పౌర్ణమి నాడు బ్లూ మూన్ కనిపించిం ది. కాబ ట్టి నేడు కనిపించే చంద్రుడిని సూపర్ బ్లూ మూన్గా పిలుస్తున్నారు. సాధార ణంగా ఏడాదిలో రెండు లేదా మూడు సూపర్ మూన్లు ఏర్పడు తుంటాయి.
కనువిందు చేసిన సూపర్ బ్లూ (వీడియో) మూన్
దేశవ్యాప్తంగా బుధవారం సాయంత్రం సూపర్ : మూన్ కనిపించింది. ఇక బీహార్ లోని పాట్నా జంక్షన్ రైల్వే స్టేషన్ వద్ద తీసిన బ్లూ మూన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణ రోజుల కంటే ప్రస్తుతం పెద్దగా, ప్రకాశవంతంగా చంద్రుడు కనిపించాడు. ఈ సూపర్ మూన్ చూసేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు ఆసక్తి కనబర్చుతున్నారు. చంద్రుని కక్ష్య అనూహ్యంగా భూమికి దగ్గరగా వచ్చినప్పుడు సూపర్ ఏర్పడుతుంది.




