అక్రమ మద్యాన్ని నివారించడం వల్లే … ఆదాయం పెరిగింది

- Advertisement -

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో మాదిరిగా బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులకు వేదింపులు లేవు

రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్.

due-to-prevention-of-illicit-liquor-income-increased
due-to-prevention-of-illicit-liquor-income-increased

రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లో ఖైరతాబాద్  మోక్షగుండం విశ్వేశ్వరయ్య హాల్ లో తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ యాజమానుల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ప్రోహిబిషన్ & ఎక్సైజ్ శాఖ అధికారుల నిరంతర కృషి వల్ల రాష్ట్రంలో నకిలీ మద్యం నియంత్రణ తో పాటు ఇతర రాష్ట్రాల నుండి తరలివస్తున్న అక్రమ మద్యాన్ని నివారించడం వల్లే నేడు రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ ఆదాయం పెరిగిందన్నారు రాష్ట్ర ప్రోహిబిషన్ & ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్. ఉమ్మడి రాష్ట్రంలో బార్ అండ్ రెస్టారెంట్ యజమానుల పై ఎన్నో వేధింపులు ఉండేవన్నారు. బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కారం చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బేవరేజ్ కార్పొరేషన్ ద్వారా నిర్వహించే గోదాముల ద్వారానే మద్యం కొనుగోలు జరుపుకోవాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. నకిలీ మద్యాన్ని అమ్మే వారిపై కఠిన చర్యలు చేపడతామన్నారు. అక్రమ మద్యం అమ్మే వారిపై అవసరమైతే PD Act కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. వార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తి మేరకు బార్లలో క్వార్టర్ ,  ఆఫ్ బాటిల్స్ తో పాటు ఫుల్ బాటిల్స్ లను అమ్ముకునేలా అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. స్లాబ్ విధానం జరిగిందన్నారు. బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు  ప్రభుత్వం సూచించిన నిబంధన మేరకు నడుపుకోవాలని సూచించారు.

due-to-prevention-of-illicit-liquor-income-increased
due-to-prevention-of-illicit-liquor-income-increased
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular