చీరప్ భారత్ పోస్టర్ ఆవిష్కరించిన చిన్న జీయర్ స్వామి
ఈనాటి సమాజంలో చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ కూడా వారి వారి పనుల ఒత్తిడి వల్ల మానసిక మరియు శారీరక రుగ్మతలకు గురవుతూ సంతోషకరమైన జీవితాన్ని గడపలేకపోతున్నారు. ఈ పరిస్థితి నుండి బయటపడే మార్గం కేవలం కళల ద్వారానే సాధ్యమవుతుందని భావించి సిరిమవ్వ ఆర్ట్స్ బృందం వారు ఒక కొత్త కాన్సెప్ట్ చీరప్ భారత్ (invoking inner happiness) ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిరి మువ్వా ఆర్ట్స్ వారు 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు వయస్సు గల వారికి ఉచితంగా నృత్య కళకళలలో శిక్షణ ఇచ్చి వారిలో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడమే కాకుండా వారికి మెగా డాన్స్ షో ద్వారా కొన్ని వేల మంది ప్రేక్షకుల ముందు ఆ నృత్యాన్ని ప్రదర్శించే అవకాశాన్ని కలపిస్తున్నారు. గతంలో వీరు 5 సీజన్లో నిర్వహించారు ఆరో సీజన్లో భాగంగా ఈరోజు చీరప్ ఇండియా లోగోను చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా వారి యొక్క ఆశ్రమంలో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్వామీజీ మాట్లాడుతూ ఒక మనిషిలోని సంతోషాన్ని బయటకి తీసుకురావడం సాధారణంగా జరిగే పని కాదు కానీ ఒక కళ ద్వారా మాత్రమే ఆ సంతోషాన్ని బయటకు తీసుకురాగలం. ఇది చాలా మంచి కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని మనసారా కోరుకుంటూ ఈ లోగోను నా చేతుల మీదుగా లాంచ్ చేస్తున్నందుకు సంతోషంగా ఫీల్ అవుతున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సిరిమువ్వ ఆర్ట్స్ డైరెక్టర్స్ వై. మధుసూదన్ రావు, వై. తులసి ప్రముఖ అంతర్జాతీయ మెజీషియన్ సామల వేణు, హైందవి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, డాన్స్ మాస్టర్ ధావన్ మరియు తదితరులు.




