సృష్టికి ప్రతిసృష్టి చేసే వాళ్లు విశ్వకర్మలు, రాతికి శిల్పాన్ని చేసి రూపం ఇచ్చి దేవున్ని చేస్తారు. రైతుకు, వ్యవసాయానికి అవసరమైన నాగలి, కర్రు, గొర్రు, మేడితోక చేసేది విశ్వబ్రాహ్మణులు. పిల్లలకు తొట్టెల దగ్గర నుండి మనిషి అంతిమ సంస్కారాలకు అవసరమైన వాటికి సహకరించేది విశ్వకర్మలు. కాలక్రమంలో నాగరికత మార్పులో అనేక వృత్తులు రూపాంతరం చెందుతాయి. ఈ పరిస్థితుల్లో విశ్వకర్మలు కూడా ఇతర రంగాలలో అద్భుతంగా రాణిస్తున్నారు. తెలంగాణ కోసం ఆచార్య జయశంకర్ సార్ జీవితాంతం పాటుపడ్డారు. ఆయన జ్ఞాపకార్థం వనపర్తి పార్టీ కార్యాలయం పక్కన ఆయన పేరిట పార్క్ ను, అందులో విగ్రహం ఏర్పాటు చేశాం. త్వరలోనే దాని ప్రారంభోత్సవం ఉంటుంది విశ్వకర్మలు అందరూ ఆ కార్యక్రమానికి హాజరు కావాలి. వనపర్తి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విశ్వకర్మల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.




