కంపెనీ వద్ద కిమ్స్ విద్యార్థులు
కోకా కోల కంపెనీ క్షేత్ర సందర్శన
కరీంనగర్ 10(వాయిస్ టుడే) స్థానిక కిమ్స్ డిగ్రీ, పీజీ కళాశాల ఫుడ్సైన్స్ విభాగంలోని డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులు శనివారం హైదరాబాద్ లోని హిందూస్తాన్ కోకా కోల బెవరేజెస్ కంపెనీని సందర్శించారని కిమ్స్ విద్యాసంస్థల వైస్ చైర్మెన్ పెరియాల సాకేత్ రామారావు తెలిపారు. ఈ పర్యటనలో విద్యార్థులు థమ్స్ అప్, మజా, ఫాంటా వివిధ రకాల శీతల పానీయాల తయారీని ప్రయోగ పూర్వకంగా ప్రత్యక్ష పద్ధతిలో నేర్చుకున్నారు. ఈ సందర్భంగా వైస్ చైర్మెన్ సాకేత్ రామారావు మాట్లాడుతూ.. విద్యార్థులకు విద్యతో పాటు విషయ పరిజ్ఞానం, క్షేత్ర పర్యటనలు అందించటంలో కిమ్స్ కళాశాలలు ఎల్లప్పుడూ ముందుంటాయని తెలిపారు. ఈ క్షేత్ర పర్యటన విజయవంతమైనందుకు విద్యార్థులు, అధ్యాపకులను అభినందించారు. తరగతి గది బోధననే కాకుండా ప్రయోగశాలలు, క్షేత్ర పర్యటనలు విద్యార్థుల మేధస్సు పెంపొందించటానికి ఎంతో అవసరమని కళాశాల ప్రిన్సిపాల్ బి.అర్జున్ రావు తెలిపారు. ఈ పర్యటనలో విభాగాధిపతి ఎన్.మహేష్, అధ్యాపకులు స్నేహ, దీపిక, సంపత్ కుమార్, మహేశ్వరి, ప్రణయ, విద్యార్థులు పాల్గొన్నారు.



