
హైదరాబాదులో లు లు కంపెనీ నిర్మించిన షాపింగ్ మాల్ తెలంగాణ ప్రజలకు అంతర్జాతీయ షాపింగ్ అనుభూతిని కల్పిస్తుందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ యూసఫ్ అలి అన్నారు. యూ ఏ ఈ కి చెందిన రిటైల్ సంస్థ లులు గ్రూప్ కంపెనీ కూకట్పల్లి జెఎన్టియు రోడ్ లో రూ .300 కోట్లతో పెద్ద షాపింగ్ మాల్ నిర్మించింది ఈ సందర్భంగా కంపెనీ డైరెక్టర్లు మేనేజర్లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మాల్ ను ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయడం జరిగిందని రెండు లక్షల చదరపు అడుగుల లో హైపర్ మార్కెట్ విస్తరించి ఉందన్నారు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు రేపు ప్రారంభిస్తారని తెలిపారు. తెలంగాణలో లు లు గ్రూపుకు ఇది మొదటి వెంచర్ అని త్వరలో మరిన్ని పెట్టుబడులు పెడతామని డైరెక్టర్ యూసుఫ్ అలీ తెలిపారు ఈ మాల్ లో అంతర్జాతీయ బ్రాండ్లు 1400 మంది సీటింగ్ కెపాసిటీ కలిగిన ఐదు స్క్రీన్ ల సినిమా, మల్టీ క్యూస్సిడ్ ఫుడ్ కోర్ట్, పిల్లల వినోద కేంద్రం ఉన్నాయన్నారు





