రోడ్డు తవ్వారు, బి టి మరిచారు
కోదాడ,సెప్టెంబర్ 29 (వాయిస్ టుడే ప్రతినిధి). నడిగూడెం మండల పరిధిలోని రత్నవరం నుండి 65వ జాతీయ రహదారి ఆకుపాముల గ్రామం వరకు 9 కి.మి రహదారి అధ్వానంగా మారింది. గుంతలమయంగా వున్న రోడ్డుని దాదాపు 8 నెలల క్రితం కొత్తగా వేయడము కోసం తవ్వి కంకర డస్ట్ పరిచారు. తర్వాత కాంట్రాక్టర్ పని చేయకపోవడవల్ల కంకర తేలీ ప్రయాణీకులు ఇబ్బంధి పడుతున్నారు. కాని అధికారులు అటువైపు కూడా చూడడం లేదు. రోడ్డు నిర్మాణానికి 4 నెలల క్రితం కంకర పరిచారు కానీ బీటీ వేయడం మరిచారు. దీంతో ఆరహదారి గుంతల మయంగామారి, కంకర తేలి ప్రమాదకరంగా తయారైంది. ఈ రహదారి మీదుగా నిత్యం రత్నవరం, చాకిరాల, శ్రీరంగాపురం, రామాపురం, ఇ. కె. పేట, తెల్లబల్లి, కోదండరామపురం గ్రామాల ప్రజలు రాకపోకలు కొనసాగిస్తుంటారు. రహదారి అధ్వానంగా మారడంతో ప్రజల రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బీటీ రహదారిని పూర్తిచేయాలని ప్రజలు కోరుతున్నారు.