పాపం పసివాడు – ఓటీటీ రివ్యూ – ఆహా లో స్ట్రీమింగ్

- Advertisement -

ఇండియన్ ఐడోల్ విన్నర్ గా, సింగర్ గా బాగా పరిచయం అయిన, శ్రీ రామ చంద్ర హీరో గా యాక్ట్ చేసిన, ఐదు ఎపిసోడ్లు గా, ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇప్పుడు ఉన్న యూత్ ప్రేక్షకుల్ని  దృష్టిలో పెట్టుకుని, ముగ్గురు హీరోయిన్స్ ని, హీరో తో ట్రావెల్ చేయిస్తు సాగిన ఒకపాటి లేజినెస్ ఆటిట్యూడ్ తో సాగిన కధ.

ఈ జనరేషన్ యూత్ లో క్లారిటీ మిస్సయిన యువకుడు క్రాంతి ( శ్రీ రామ చంద్ర ), తన ఫస్ట్ లవర్ డింపీ ( గాయత్రి చాగంటి ) తో బ్రేకప్ తర్వాత, విచిత్రమైన సిట్యుయేషన్ లో, బార్లో పరిచయం ఐన, చారు (రాశి సింగ్ ) తో చారు ఫ్లాట్ లో తనతో ఒక రాత్రి బాగా దగ్గరై తనతో గడిపి, అదే అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో  చారు ఫ్లాట్ మర్చిపోయి, డెన్పరేట్ గా తిరుగుతుంటాడు.

Paam Pasivadu - OTT Review - Streaming on Aha
Paam Pasivadu – OTT Review – Streaming on Aha

ఈ పరిస్థితుల్లో, క్రాంతి పేరెంట్స్ అనూష ( శ్రీ విద్య మహర్షి ) తో క్రాంతి కీ, పెళ్ళి ఫిక్స్ చేస్తారు.

అనూష తో ఎంగేజ్మెంట్ చేసుకున్న క్రాంతి, చారు తో మళ్ళా లవ్ ట్రాక్ నడపడం, ఈ లోపు, వీడిపోయిన డింపీ తిరిగి క్రాంతి లైఫ్ లోకి రావడం, లాంటి టర్నింగ్స్ తో దర్శకుడు – లలిత్ కుమార్ సిట్యుయేషనల్ కామెడీ ని కొంత వరకు పండించడానికి ట్రై చేశాడు.

మధ్యలో, కమెడియన్ వేణు చిలక జోస్యం చెప్పే పాత్ర లో, చక్కని ఈజ్ తో మెప్పించాడు.

చివరకి, క్రాంతి, అనూష, చారుల్లో ఎవర్ని పెళ్ళి చేసుకుంటాడు? బ్రేక్ అప్ తర్వాత తిరిగొచ్చిన డింపీ పొజిషన్ ఏంటి? ముప్పైయేళ్ళు దాటినా పెళ్ళి కాని, క్రాంతి లైఫ్ ఏ మలుపులు తిరిగిందో తెలుసుకోవాలంటే, ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న పాపం పసివాడు చూడాలి.

దర్శకుడు ఈ కధ లో, తనే కొంత కన్ఫ్యూజ్ అయినట్లు, లాగ్ లోకి స్క్రిప్ట్ ని పట్టుకెళ్లాడు.

జోస్ జిమ్మీ మ్యూజిక్, గోకుల్ భారతి ఫోటోగ్రఫీ వాళ్ళ వాళ్ళ పరిధి లో ఓకే అనిపించారు.

దర్శకుడు ఎంత యూత్ ని టార్గెట్ చేసిన, కొన్ని బోల్డ్ డైలాగ్స్ అవాయిడ్ చేయాల్సింది.

పెద్ద గా ఎక్సపెక్టషన్స్ లేకుండా, టైం పాస్ కోసం చూసే ఓటీ టీ సిరీస్ – ఆహా నా పెళ్ళంట.- ఆహా లో అవైలబుల్ గా ఉంది.

– సత్య కేశరాజు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular