ముత్తయ్య మురళీధరన్ జీవిత కధ – 800
శ్రీలంక క్రికెటర్ మురళీధరన్ జీవిత చరిత్ర గా తీసిన సినిమా కీ, అస్సలు 800 పేరు పెట్టడమే ఒక మేజికల్ సెలక్షన్.
ఎందుకంటే – టెస్టు క్రికెట్లో 800 వికెట్లు తీసిన బౌలర్ గా ప్రపంచ రికార్డు మురళీ పేరున ఉంది.
ప్రపంచం లో, క్రికెట్ ఆట మీద కనీసము అవగాహన ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి కూడా, మురళీధరన్ పేరు చిర పరిచయం.

శ్రీలంక లో ఎల్ టీ టీ ఈ తమిళలు ఆ దేశం మీద భీకరం గా పోరాటం చేస్తున్న కష్టమైన టైం లో, మురళీ అనే తమిళ యువకుడు, క్రికెట్ ఎలా నేర్చుకున్నాడు, జాతీయం గా, అంతర్జాతీయం గా, క్రికెట్ ప్రపంచం లో, తన ప్రెసెన్స్ ని బలంగా ఎలా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడో, ఈ చిత్రం లో దర్శకుడు – ఎం. ఎస్. శ్రీపతి – చూపించడాని మనకి ట్రైలర్ చుస్తే అర్ధం అవుతుంది. మనకు తెలియని, ఎప్పుడూ నవ్వుతూ, మైదానం లోపల, బయట కూడా వినమ్రంగా ఉండే, ఈ అద్భుతమైన క్రికెటర్ జీవితం లో జరిగిన ఎన్నో సంఘటనలు, అతను పడ్డ కష్టం దీంట్లో అందం గా తీర్చిదిద్దినట్లు గా ట్రైలర్ తెలిస్తోంది
మురళిధరన్ గా, “స్లం డాగ్ మిలియనీర్” సినిమా లో నటించిన, మధుర్ మిట్టల్ పోషించాడు.
800 సినిమా ట్రైలర్ ముంబై లో సచిన్ టెండూల్కర్, బెంగుళూరు లో అనిల్ కుంబ్లె, హైదరాబాద్ లో వీ. వీ. ఎస్. లక్ష్మణ్ ఆవిష్క రిస్తూ, తమ చిరకాల స్నేహితుడి కమిట్మెంట్ ని, అట లో అతని నిబద్దతని మళ్ళా ఒక సారి మనకు గుర్తు చేశారు. ఈ సందర్భం గా మురళీ ధరన్ మాట్లాడుతూ, ఎలాంటి అవస్తావ, మసాలా సంఘటనలు లేని ప్యూర్ సినిమా ఇది, అని చెప్పడం తో ఇంకా ఇష్టం పెరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం -ఒక పోరాట యోధుడి జీవితం చూడాలంటే – 800 సినిమా – ఈ అక్టోబర్ 6 న థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. ఇతని ఆట లాగే సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని, ముఖ్యం గా యువత పరిస్థితుల్ని ఎదిరించి ఎలా గెలవాలో, ఎలా విశ్వావిజేత గా నిలవాలో, నేర్చుకుంటారని ఆశిద్దాం – అల్ ది బెస్ట్ చెబుదాం.
– సత్య కేశరాజు



