సిద్దిపేట: సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి శివారులో స్వయం ఉపాధి శిక్షణ పొందే మహిళా ప్రాంగణం, వృద్ధాశ్రమం, జిల్లా మహిళా సమాఖ్య భవనంను మంత్రి హరీష్ రావు సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ తదితరులు హజరయ్యారు.

మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ నూతన జిల్లాలలో మొదటి జిల్లా సమాఖ్య భవనం సిద్దిపేటలోనే. సీఎం కెసిఆర్ ఇచ్చే 2016 పించన్ వల్ల వయో వృద్దులకు కొంత ఉపశమనం కలిగింది. వయో వృద్ధులను ఈ వృద్ధాశ్రమం లో కన్న తల్లిదండ్రుల వలె చూసుకుంటాం. క్షణికావేశంలో మహిళలు ప్రాణప్రాయ నిర్ణయాలు తీసుకోవద్దని భరోసా, సఖి సెంటర్ లు ఏర్పాటు చేశాం. 120మంది ఉండేలా మహిళా వర్కింగ్ ఉమెన్స్ హస్టల్ నిర్మించాం. బాల రక్ష భవన్ లో 6 ఎండ్ల నుండి 18ఎండ్ల ఆడపిల్లలకు రక్షణ ఇస్తారు. తల్లిదండ్రులు లేని అనాధ పిల్లలకు శిశుగ్రహ కేంద్రంలో రక్షణ ఇస్తున్నామని అన్నారు. ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి ద్వారా లక్ష రూపాయలు ఇస్తున్నాం గత ప్రభుత్వాలు ఎం ఇవ్వలేదు. వైద్య వ్యవస్థను బలోపేతం చేశాం. ప్రభుత్వ ఆసుపత్రులలో డెలివరి ల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో భూమికి బరువు అయ్యేంత పంట పండుతుంది. గతంలో ఎరువు బస్త కోసం చెప్పులను క్యు లైన్ లో పెట్టేవారు. గతంలో మనం కూలికి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు పక్క రాష్ట్రాల వారికి కులీ ఇచ్చే పరిస్థితికి చేరుకున్నాం
కెసిఆర్ మాట అంటే తప్పడు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటడు. కొందరు నాలుకకు నరం లేదనీ ఇష్టం వచినట్టు మాట్లాడుతారు. పొరపాటున కాంగ్రెస్ చేతిలో రాష్ట్రాన్ని పెడితే కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్టే . విఓఏ లను అదుకున్నది బి అర్ ఎస్ ప్రభుత్వం, మీకు ఉద్యోగస్తుల తో పాటు పి ఆర్ సి కల్పించాం. బీజేపీ గ్యాస్ ధర ను అడ్డగోలుగా పెంచింది, దాన్ని తగ్గించే ప్రయత్నం కెసిఆర్ చేస్తున్నాడు. ఏ పథకం అయినా మహిళ పేరిట పెడితే సద్వినియోగం అవుతుందనీ కెసిఆర్ మహిళల పేరిట పథకాలు తెచ్చాడని అన్నారు.



