మల్కాజిగిరి: మంత్రి మల్లారెడ్డి పై మైనంపల్లి హనుమంత రావు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. డబ్బుతో వచ్చి ఎంపి ఆయ్యాడు. 100 కోట్లు పెట్టి మంత్రి అయ్యాడు. అయన కాలేజీలు మొత్తం చెరువులోనే ఉన్నాయి. మల్లా రెడ్డి ఓ పెద్ద అవినీతి పరుడని ఆరోపించారు. చామకూర మల్లా రెడ్డి ఓ బఫూన్ మంత్రి…ఇంగితజ్ఞానం లేకుండా గల్లి లీడర్ గా తిరుగుతున్నాడు. అధికారం అడ్డుపెట్టుకుని నోట్ల కట్టలతో ఓట్లు కొనాలని చూస్తున్న మంత్రికి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారు మల్కాజిగిరి ప్రజలు. మంత్రి మల్లారెడ్డి కాదు కబ్జాల మల్లారెడ్డి…అభద్రతా భావం తో తన వ్యక్తిగత భద్రతా సిబ్బందితో పాటు పోలీసు అధికారులను మార్చిన భయస్తుడు మల్లారెడ్డి. పోలీసుల అవినీతి చిట్టా బయట పెడతా… బారాసా కాలం చెల్లింది మల్కాజిగిరిలో లక్ష ఓట్ల మెజారిటీ తో కాంగ్రెస్ జెండా ఎగురవేసి తీరుతా. మల్కాజిగిరి ప్రజలను తక్కువ అంచనా వేయొద్దు…పథకాలన్నీ కమిషన్ల కోసం మాత్రమే. 30 శాతం కమిషన్ల కోసమే పథకాలు తెచ్చారు… ఈ ఎన్నికల్లో బారాస పతనం ఖాయం. గత ఐదు సంవత్సరాలుగా కోట్లాది రూపాయలతో మల్కాజిగిరి అభివృద్ధి చేసిన ఘనత నాదేనని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బి ఆర్ ఎస్ పార్టీ పతనమే ధ్యేయంగా ఎన్నికల్లో ప్రచారం నిర్వహించబోతున్నానని వెల్లడించారు.



