Saturday, February 14, 2026

జయం రవి, నయనతార మూవీ గాడ్ సెన్సార్ పూర్తి…. అక్టోబర్ 13న గ్రాండ్ రిలీజ్

- Advertisement -

తనీ ఒరువన్ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌ తర్వాత జయం రవి, నయన తార హీరో హీరోయిన్లుగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘గాడ్’. ఐ.అహ్మద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సుధన్ సుందరం, జి.జయరాం, సి.హెచ్.సతీష్ కుమార్ నిర్మాతలు. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం అక్టోబర్ 13న తెలుగులో విడుదలవుతుంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్బంగా…

Jayam Ravi, Nayanthara Movie God Censor Completed…. Grand release on October 13
Jayam Ravi, Nayanthara Movie God Censor Completed…. Grand release on October 13

నిర్మాతలు సుధన్ సుందరం, జి.జయరాం, సి.హెచ్.సతీష్ కుమార్ మాట్లాడుతూ ‘‘క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఓ ఆదరణ ఉంటుంది. ఆ కోవలో తమిళంలో విడుదలైన మంచి విజయాన్ని సాధించిన ఇరైవన్ చిత్రాన్ని తెలుగులో గాడ్ అనే పేరుతో విడుదల చేస్తున్నాం. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ర‌న్ టైమ్‌ను 2 గంట‌ల 16 నిమిషాలుగా ఫిక్స్ చేశాం. హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న జయం రవి, నయనతార ఇందులో మళ్లీ జత కట్టారు. అక్టోబర్ 13న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆసాంతం సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా మెప్పిస్తుంది’’ అన్నారు.

Jayam Ravi, Nayanthara Movie God Censor Completed…. Grand release on October 13
Jayam Ravi, Nayanthara Movie God Censor Completed…. Grand release on October 13

న‌టీన‌టులు: జ‌యం ర‌వి, న‌య‌న‌తార‌, వినోద్ కిష‌న్‌, రాహుల్ బోస్‌, విజ‌య‌ల‌క్ష్మి, న‌రైన్‌, ఆశిష్ విద్యార్థి త‌దిత‌రులు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్