Thursday, May 7, 2026

అక్రమంగా తరలిస్తున్న నగదు పట్టివేత

- Advertisement -

అక్రమంగా తరలిస్తున్న నగదు పట్టివేత

మేడిపల్లి, అక్టోబర్ 12 (వాయిస్ టుడే) : ఈ రోజు మధ్యాహ్నం నారపల్లి వద్ద వాహనాల తనిఖీలో బాగంగా అక్రమంగా తరలిస్తున్న 13 లక్షల 50 వేల రూపాయల నగదును కిషోర్, అనే వ్యక్తి నుండి వెంకటాద్రి టౌన్షిప్ వద్ద స్వాధీన పరచుకుని తదుపరి విచారణ నిమిత్తం ఎన్నికల ప్లయింగ్ స్క్వాడ్ వారికి అప్పగించడం జరిగింది. రాబోయే శాసన సభ ఎన్నికల దృష్ట్యా ఒక వ్యక్తి యాభై వేల రూపాయల మించి నగదును కలిగి ఉన్నట్లయితే కచ్చితంగా ఆధారాలు చూపించాలి. లేనియెడల అట్టి నగదును జప్తు చేయడం జరుగుతుంది. అలాగే ఓటర్లను ప్రభావితం చేసే కానుకలు ( చీరలు, కుక్కర్లు, వెండి బంగారు ఆభరణాలు, టోకెన్లు ) మరియు మరే ఇతర వస్తువులను అక్రమంగా కలిగిఉన్న కూడా అది ఎన్నికల నియమావళి కిందకే వస్తుంది. ముందస్తు సమాచారం ఇచ్చిన వారి వివరాలు కూడా గోప్యంగా ఉంచడమే కాకుండా అట్టి వారికి తగిన గుర్తింపు కూడా ఇవ్వడం జరుగుతుంది. సిబ్బందికి సహకరించండి – ఎన్నికలు సజావుగా జరిగేలా తోడ్పాటు అందించండి. అని తెలియజేశారు. మేడిపల్లి ఇన్స్పెక్టర్ సైదులు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్