కేర్ సెంటర్ లో చేర్పించి నూతన వస్త్రాలు అందించిన ఉపసర్పంచ్ దంపతులు

- Advertisement -

కేర్ సెంటర్ లో చేర్పించి నూతన వస్త్రాలు అందించిన ఉపసర్పంచ్ దంపతులు

ఆపదలో ముందుంటున్న ఉపసర్పంచ్ దంపతులు

అభినందిస్తున్న గ్రామస్తులు
వాయిస్ టుడే ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా అక్టోబర్ 13: ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో గల బస్ స్టాండ్ లో తలదాచుకుంటున్న కొత్తపల్లి కి చెందిన వేదాంతి పద్మా వతి(99)వేదాంతి గోపాల చారి (70) ల పరిస్థితి తెలుసుకుని ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్, గంభీరావుపేట ఎస్ ఐ మహేష్ లు కలిసి ఎల్లారెడ్డిపేట లో గల డే కేర్ సెంటర్ కు తరలించారు. కాగ గోపాల చారి కట్టు బట్టలతో ఉంటున్నామని వాటితో కాలం వెళ్లదీస్తూన్నామని ఇంటికి వచ్చి చెప్పగా ఉపసర్పంచ్ దంపతులు ఒగ్గు రజిత బాలరాజు యాదవ్ తన కూతురు ఒగ్గు శ్రీనిధి యాదవ్ లు తల్లి కొడుకులు పద్మావతి కి గోపాలచారికి నూతన వస్త్రాలు అందించారు.తన తల్లి గారి గ్రామం కొత్తపల్లి కి చెందిన పురోహిత కుటుంభానికి ఇంతటి కష్టం రావడం బాధ గా ఉందని ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ ఆవేదన వ్యక్తంచేశారు.ప్రతి నెల మందులు వాడుతున్నమని చెప్పగా మందులను ఇప్పిస్తామని గోపాల చారి కి భరోసా ఇచ్చారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular