Sunday, March 8, 2026

ఎంపీ వద్దిరాజు ఇల్లందులో ప్రెస్ మీట్

- Advertisement -

మనమందరం కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ సభను విజయవంతం చేద్దాం: గులాబీ శ్రేణులు,ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఎంపీ రవిచంద్ర. మంత్రి సత్యవతి, లోకసభ సభ్యురాలు కవిత,ఎమ్మెల్యే హరిప్రియలతో కలిసి ఇల్లందులో ప్రెస్ మీట్ పెట్టిన ఎంపీ రవిచంద్ర

Press meet at MP Vadiraju Illandu
Press meet at MP Vadiraju Illandu

బీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు నవంబర్ 1వ తేదీన ఇల్లందు “ప్రజా ఆశీర్వాద సభ”కు హాజరై ప్రసంగించనున్న భారీ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాల్సిందిగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గులాబీ శ్రేణులు,ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ సభ జరుగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్న ఎంపీ రవిచంద్ర శుక్రవారం ఇల్లందులో పర్యటించారు.ఎంపీ రవిచంద్ర మొదట ఈ సభకు సంబంధించిన ఏర్పాట్ల గురించి ఎమ్మెల్యే బానోతు హరిప్రియ హరిసింగ్ నాయక్ క్యాంపు కార్యాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్, లోకసభ సభ్యురాలు మాలోతు కవిత, మహబూబాబాద్ జెడ్పీ ఛైర్మన్ అంగోతు బిందులతో కలిసి సమీక్ష జరిపారు.ఆ తర్వాత

ఆత్మీయ విందులో పాల్గొని,వారితో కలిసి విలేకరులతో మాట్లాడారు.అహింసా మార్గంలో మహోద్యమాన్ని నడిపించి రాష్ట్రాన్ని సాధించడమే కాక,దాన్ని అన్ని రంగాలలో ప్రగతిపథాన పరుగులు పెట్టిస్తున్న మహానేత కేసీఆర్ హాజరయ్యే సభకు పెద్ద సంఖ్యలో స్వచ్చంధంగా తరలివచ్చి విజయవంతం చేయాల్సిందిగా గులాబీ శ్రేణులు,ప్రజలను ఎంపీ వద్దిరాజు కోరారు.ఈ ఎన్నికలలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హరిప్రియ భారీ ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని ఎంపీ రవిచంద్ర ధీమా వ్యక్తం చేశారు.విలేకరుల సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దిండిగాల రాజేందర్, ఇల్లందు మునిసిపల్ ఛైర్మన్ ధమ్మాలపాటి వెంకటేశ్వరరావు(డీవీ), పార్టీ ప్రముఖులు మూల మధుకర్ రెడ్డి, మూడ్ కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్