Wednesday, April 22, 2026

ముదిరాజు సోదరులు అదైర్య పడొద్దు అండగా ఉంటాం

- Advertisement -

బోడుప్పల్ బిఆర్ఎస్ అధ్యక్షులు – మంద సంజీవరెడ్డి

Brothers of Mudiraju, don't be discouraged, we will stand by you
Brothers of Mudiraju, don’t be discouraged, we will stand by you

బోడుప్పల్, అక్టోబర్ (వాయిస్ టుడే) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రా చెరువులోనికి చుట్టూ ఉన్న ఇండస్ట్రియల్ కంపెనీ వ్యర్థ, రసాయనాల నీళ్లు వదలడంతో చెరువులోని చాపలు చనిపోవడం జరిగిందని మాకు 15 లక్షల రూపాయల వరకు నష్టపరిహారం జరిగిందని ముదిరాజు సంఘ సభ్యులు  అన్నారు. తక్షణమే మాకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేయాలని బోడుప్పల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవరెడ్డికి విన్నవించారు. వారు రాచెరువుని సందర్శించి   చనిపోయిన చేపలను వీక్షించి వారు మాట్లాడుతూ, ముదిరాజులకు జీవన ఆధారమైన సుమారు 45 ఎకరాల రా చెరువు మీద 300 కుటుంబాల వరకు బ్రతుకుతున్నాయని దొంగ చాటున కొన్ని కంపెనీలు పైపులైను ద్వారా రా చెరువులోకి రసాయనాలను పంపిస్తున్నారు. ఉప్పల్ ఇండస్ట్రీ, నాచారం మల్లాపూర్ చర్లపల్లి కంపెనీల చైర్మన్ లకు నేను ఒకటే చెబుతున్నా  రా చెరువుతో జీవనోపాధి పొందుతున్న ముదిరాజులు వేల కుటుంబాలు రోడ్డు మీదకు వస్తాయని ఇకనైనా చర్యలు తీసుకోవాలని వ్యర్థ, రసాయనాలు  రా చెరువులోకి రాకుండా చూసుకోవాలని ఇరిగేషన్ పోలీస్ కంట్రోల్ వెంకట నరసయ్య కు ఫోన్ ద్వారా తెలియజేశారు. ముదిరాజు సోదరులు అధర్య పడొద్దని  చర్యలు తప్పకుండా తీసుకుంటామని నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలని  నేను కూడా ఈ విషయాన్ని మంత్రి మల్లారెడ్డి దృష్టికి తిసుకెళ్లి నష్టపరిహారం అందేలా చేస్తానని ముదిరాజు సంఘ సభ్యులతో అన్నారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ కార్యదర్శి మీసాల కృష్ణ, కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Brothers of Mudiraju, don't be discouraged, we will stand by you
Brothers of Mudiraju, don’t be discouraged, we will stand by you
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్