గంటల కొద్ది కరెంట్ కట్
తీవ్ర అసౌకర్యానికి గురయిన భక్తులు
శ్రీకాళహస్తి ఆలయ అధికారులపై మండిపాటు
తిరుపతి: తిరుపతి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో రాహు కేతు పూజ సమయంలో కొన్ని గంటలపాటు విద్యుత్ సరఫరా ఆగిపోవడం తో వృద్దులు,మహిళలు,చిన్న పిల్లలు తీవ్ర అసౌకర్యానికి గురైనట్టు, ఆలయంలో భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదంటూ ఆలయ అధికారుల తీరుపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్రీకాళహస్తిలోని శ్రీ కాళహస్తిశ్వర స్వామి పుణ్యక్షేత్రం కు ఈరోజు అమావాస్య శనివారం సందర్భంగా రాహు కేతు పూజ చేయించుకునేందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండే కాక ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా అధిక సంఖ్యలో తరలివచ్చారు,ఇదే సమయంలో దేవాలయం లో కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా లేకుండా పోవడంతో రాహుకేతు పూజ చేయించుకునేందుకు వచ్చిన భక్తులు చీకటి,ఉక్కపోత కారణం గా ఆలయంలో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు, భక్తులు మాట్లాడుతూ ఎంతో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి దేవాలయంలో దళారులు ఎక్కువయ్యారని ఆలయ అధికారులు భక్తుల సౌకర్యాల పట్ల ఏమాత్రం శ్రద్ధ వహించడం లేదని చిన్నపిల్లలు వృద్ధులు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని గంటల తరబడి కరెంటు లేకపోయినా పట్టించుకునే నాధుడే లేడని ఇంత పెద్ద చరిత్ర కలలిగిన దేవాలయానికి ఆలయ అధికారుల తమ తీరుతో చెడ్డ పేరు తీసుకువస్తూ భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు…
నిన్న శ్రీకాళహస్తి దేవాలయంలో పాము కనిపించడం ఈరోజు కరెంటు కోతలతో భక్తుల అల్లాడిపోవడం, వృద్ధులకు చిన్న పిల్లలకు సరైన సౌకర్యాలు కల్పించకపోవడం, రాహు కేతు పూజకు సంబంధించిన టిక్కెట్ల జారీ విషయంలో దళారుల జోక్యం ఎక్కువ అవ్వడం, దేవాలయానికి వచ్చే భక్తుల దగ్గర పూజల పేరుతో కొందరు దళారులు విపరీతంగా డబ్బులు దోచేస్తున్నారనీ, విపరీతమైన రాజకీయ జోక్యంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తదితర ఆరోపణలతో శ్రీకాళహస్తి దేవాలయం పేరు దెబ్బతింటుందని కొందరు హిందూ వాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు