నా కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్తున్నా…
ప్రజల అభీష్టం మేరకు ఉప్పల్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తా…
తన కార్యాచరణ రెండు రోజుల్లో ప్రకటిస్తా:- కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన రాగిడి లక్ష్మారెడ్డి
ఉప్పల్ (వాయీస్ టుడే ప్రతినిధి):- గత 20 సంవత్సరాలుగా కన్నతల్లి అయిన కాంగ్రెస్ పార్టీ నమ్ముకుని తాను ఉప్పల్ నియోజకవర్గ ప్రజలతో మమేకమై ప్రజాభిమానిగా గుర్తింపు పొందిన తనకు,ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడం బాధాకరమని రాగిడి లక్ష్మారెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. హబ్సిగూడ లోని తన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన బోరున విలపించారు. నేను ఏడుస్తున్నానని నేనొక పిరికి వాడినని అనుకోకు రేవంత్ రెడ్డి, నేను రాడికల్ స్టూడెంట్లో పనిచేసి ఒక ఉద్యమ నేతగా ప్రజల మనిషిగా గుర్తింపు పొందానని,నీలాగా దొంగ పదవులు తెచ్చుకోలేదని, నీలా ఓటు నోటుకు అమ్ముడు పోలేదని ఆయన ఆవేదనతో అన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకీ పూర్వ వైభవం తెచ్చిన తనకు టిక్కెట్ ఇవ్వని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి,నీవు ఏ లెక్కల ప్రకారం నాకు టికెట్ ఇవ్వలేదని,పది డివిజన్లో సర్వే చేశావా, నిన్ను ప్రజలు కొడంగల్ లో చీ కొడితే.. నీవు మల్కాజిగిరిలో ఎంపీగా పోటీ చేస్తే మేమందరం సపోర్ట్ చేశాము.. మాకు చేసే ద్రోహం ఇదా.. ఎంపీగా గెలిచి ఏం చేశావని మల్కాజ్గిరి ప్రజలు అడుగుతుంటే మేం ఎంతో బాధపడ్డామన్నారు. నీవు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఐదేళ్లు కాలేదు,కనీసం పార్టీ గురించి అవగాహన లేదు. నీవు ఒక పొట్టే గానివి, నాకన్నా చిన్నోడివి, అయినా నేను అన్నా అని సంబోధించా, నాకు టికెట్ ఇస్తానని, అన్నా నీకు ప్రచారం చేసుకొ అని చెప్పడంతో తాను లక్షల రూపాయల ఖర్చు పెట్టానని, తన మధుర చారిటబుల్ ట్రస్ట్ నుండి ఎంతోమందికి సేవ చేశానని, ఆ అభిమానం చూసి నాకు టిక్కెట్టు ఇవ్వలేదా, నీ వెంత..నీ బతుకేంత రేవంత్ రెడ్డి..నా ఉసురు.. నీకు కచ్చితంగా ముడుతుందని, నా కథ ఏందో ఇక కాస్కో నీ అంతు చూస్తానని ఆయన ఆవేదనతో అన్నారు.గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన బండారు రాజిరెడ్డి, ఆరోగ్యం దృష్ట్యా పార్టీకి దూరం కావడంతో, ఆనాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఉంటూ కార్యకర్తల, నాయకుల బాగోగులు చూసుకుంటూ కార్యకర్తల మధ్యన ఉన్న నాకు టికెట్ ఇవ్వకుండా, కాంగ్రెస్ పార్టీని వదిలి,గతంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన మందముల్ల పరమేశ్వర్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టిక్కెట్ ఖరారు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఒక్కసారి చీ అన్నాక నువ్వు కోట్ల రూపాయలు ఇచ్చి మరోసారి పార్టీలోకి ఆహ్వానించినా,పార్టీ టికెట్ కేటాయించినా తాను ఒక్కసారి ఛీ అన్నాక నేను మరొక్కసారి పార్టీలోకి రానని ఆయన అన్నారు. గత కార్పొరేషన్ ఎన్నికలలో నన్ను డబ్బులు అడిగావని,నేను డబ్బులు ఇవ్వకుండా నేను కార్పొరేటర్ల ను పలువురుని గెలిపించుకుంటానని అక్కడ ఖర్చు చేస్తానని చెప్పడం,నేను డబ్బులు ఇవ్వనందుకే నాకు ఈరోజు టిక్కెట్ ఇవ్వలేదని,నేను కూడా నీవు అడిగిన కోట్ల రూపాయలు ఎమ్మెల్యే టికెట్ కోసం ఇస్తానని ప్రాదేయపడినా,గతంలో కాంగ్రెస్ పార్టీని మోసం చేసి, పార్టీ కోసం పని చేయకుండా పార్టీని మోసం చేసిన వ్యక్తి పరమేశ్వర్ రెడ్డికి నేడు టికెట్ ఇవ్వడం నీకు చేతులు ఎలా వచ్చాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నా యొక్క రాజీనామా పత్రాన్ని ఎఐసిసి అధ్యక్షుడు కరిగేకు పంపిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నేను కూడా ఉప్పల్ నియోజకవర్గం నుండి ప్రజల అభీష్టం మేరకు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని,మరో రెండు రోజుల్లో నా యొక్క కార్యాచరణ ప్రకటిస్తానని రాగిడి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పెద్ద ఎత్తున మహిళలు, కార్యకర్తలు, నాయకులు,అభిమానులు వచ్చారు. మరి కొంతమంది రాగిడి లక్ష్మారెడ్డికి టికెట్ రాలేదని, మహిళా కార్యకర్తలు నాయకులు బోరున విలపించారు. అనంతరం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను తగలబెట్టారు.



