వికారాబాద్ జిల్లా కేంద్రం నుంచి నా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది..
టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి
వికారాబాద్ జిల్లా కేంద్రంలో టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలను ఇంటింటికి తిరుగుతూ వివరించారు అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ హుస్నాబాద్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తే నేను వికారాబాద్ గడ్డ నుంచి ప్రారంభిస్తున్నాను. ఈరోజు నుంచి కేసీఆర్ పతనం ప్రారంభమైంది వికారాబాద్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలలో ఉన్న అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకొని రాష్ట్రంలో అధికారం సాధించాలని పిలుపునిచ్చారు. టిఆర్ఎస్ పార్టీ తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలు విసుగెత్తిపోయారని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని ప్రతి ఒక్కరూ ఓటు వేసే ముందు ఆరు గ్యారంటీలను దృష్టిలో ఉంచుకొని చేతి గుర్తుకు ఓటు వేయాలని కోరారు. గత ఎన్నికలలో అధికార దుర్వినియోగంతో ఎన్నికల చివరి క్షణంలో తనని జైలుకు పంపారని గడ్డం ప్రసాద్ కుమార్ ఓడిపోవడానికి చంద్రశేఖర్ ప్రధాన కారణమైతే.. వికారాబాద్ లో ప్రచారానికి రాకుండా నేను కూడా కారకూడనయ్యానని ఈసారి మాత్రం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వికారాబాద్ ప్రాంతానికి చెందిన ఇద్దరు మాజీ మంత్రుల మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా మాజీ మంత్రి చంద్రశేఖర్ ని జహీరాబాద్ అభ్యర్థిగా, గడ్డం ప్రసాద్ కుమార్ ని వికారాబాద్ అభ్యర్థిగా నియమించామని ఈ రెండు స్థానాలలో భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని తెలిపారు.




