Wednesday, February 11, 2026

దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు మధ్య ఎన్నికలు: రాహుల్ గాంధీ

- Advertisement -

ములుగు జిల్లా:అక్టోబర్ 18:  బిఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రనేత రాహుల్ గాంధీ, సంచలన వ్యాఖ్యలు చేశారు.  అభివృద్ధి అనే గ్యారెంటీతో తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని,తెలంగాణలో వచ్చేది ముమ్మాటికి కాంగ్రెస్‌ ప్రభుత్వమే అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తంచేశారు.

కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా బుధవారం ములుగులో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో పాలన కొనసాగడం లేదని పేర్కొన్నారు. దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఈ సారి ఎన్నికలు జరగబోతున్నాయన్నారు.

Elections between the Telangana of the aristocracy and the Telangana of the people: Rahul Gandhi
Elections between the Telangana of the aristocracy and the Telangana of the people: Rahul Gandhi

కాంగ్రెస్‌ ఇచ్చిన మాట ప్రకారం.. తెలంగాణ ఇచ్చిందని.. కానీ ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా పాలన జరుగుతుందంటూ మండిపడ్డారు. రాజకీయ పార్టీలు తమకు నష్టం జరిగే నిర్ణయాలు తీసుకోవని.. కానీ..తెలంగాణ విషయంలో ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నారు.

ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్‌ గౌరవించి తెలంగాణ ఇచ్చిందని రాహుల్ గుర్తుచేశారు. సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నో హామీలిచ్చి మోసం చేశారని విమర్శించారు. అందరికీ ఉద్యోగాలిస్తామని కేసీఆర్‌ మోసం చేసి పాలన చేస్తున్నారంటూ పేర్కొన్నారు.

ధరణి పోర్టల్‌లో అవినీతి జరిగిందని.. అందుకే తాము రద్దు చేస్తామనన్నామని తెలిపారు. రూ.లక్ష రుణమాపీ అన్నారు..చేయలేదని పేర్కొన్నారు. మూడెకరాల భూమి కూడా ఇవ్వలేదని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా పాలన చేయడం లేదని దుయ్యబట్టారు.

రామప్ప వంటి సుందరమైన ఆలయాన్ని ఇప్పటి వరకూ చూడలేదన్నారు. రాహుల్‌గాంధీ. 2004లో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చిందని.. ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ ఎలా సాకారం చేసిందో ప్రపంచమంతా చూసిందన్నారు…

Elections between the Telangana of the aristocracy and the Telangana of the people: Rahul Gandhi
Elections between the Telangana of the aristocracy and the Telangana of the people: Rahul Gandhi
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్