న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ ను  గెలిపించాలి

- Advertisement -

జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్రం సత్యనారాయణ విజ్ఞప్తి

హైదరాబాద్ అక్టోబర్ 18: జాతీయ బీసీ సంక్షేమ సంఘం  రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ ను  సంగారెడ్డి  నియోజకవర్గం,  నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి- జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్రం సత్యనారాయణ విజ్ఞప్తి చేసారు. హైదరాబాద్,  జాతీయ బీసీ సంక్షేమ సంఘం  కోర్ కమిటీ  ఏర్పాటుచేసిన సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్రం సత్యనారాయణ  మాట్లాడుతూ  నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్న  జాతీయ బీసీ సంక్షేమ సంఘం  సంపూర్ణ మద్దతు  జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ కు ఉంటుందని  అదేవిధంగా  సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు, నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రజలు  ప్రజాస్వామ్యం పట్ల సంపూర్ణ అవగాహన కలిగిన  న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ ను  ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించి  చట్టసభల్లోకి పంపించాల్సిన బాధ్యత మనందరిదని తెలియజేశారు. అదేవిధంగా  న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో  మేధాశక్తితో,  పోరాడే తత్వంతో  ముందుకు సాగే  దమ్మున్న  నాయకుడు అని  తెలియజేశారు. ఈ యొక్క కోర్ కమిటీ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ ,  జాతీయ ప్రధాన కార్యదర్శి  సుధాకర్,  చైర్మన్  ఉదయ్ కుమార్ నేత, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు నందగోపాల్,  విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు రామకృష్ణ  మరియు  బీసీ సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular