Friday, March 6, 2026

త్రిపుర నూతన గవర్నర్‌గా తెలంగాణ భాజపా సీనియర్‌ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి

- Advertisement -

త్రిపుర, ఒడిశా రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమితులయ్యారు. త్రిపుర నూతన గవర్నర్‌గా తెలంగాణకు చెందిన భాజపా సీనియర్‌ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి, ఒడిశా గవర్నర్‌గా ఝార్ఖండ్‌ మాజీ సీఎం రఘుబర్‌ దాస్‌లను నియమిస్తూ రాష్ట్రపతి కార్యాలయం బుధవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. నల్లు ఇంద్రసేనా రెడ్డి తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు చెందినవారు. ఆయన గతంలో మలక్‌పేట నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రంలో భాజపా చేరికలు, సమన్వయ కమిటీ ఛైర్మన్‌గా 2022లో నియమితులైన విషయం తెలిసిందే. ఒడిశా గవర్నర్‌గా నియమితులైన రఘుబర్‌దాస్‌ ప్రస్తుతం భాజపా జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు ఆయన జార్ఖండ్‌ సీఎంగా పనిచేశారు._

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్