ఆ పార్టీలో ఆత్మగౌరవం ఉండదు

- Advertisement -

హైదరాబాద్, అక్టోబరు 21, (వాయిస్ టుడే):  కాంగ్రెస్ పార్టీకి టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ రాజీనామా చేశారు.

గులాబీ గూటికి చెరుకు సుధాకర్?

ఇవాళ కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో బీసీల ఆత్మ గౌరవానికి భంగం కలుగుతుందన్నారు. బీసీలను అణగదొక్కే కుట్ర జరుగుతోందని.. ఓడిపోయే స్థానాల్లో బీసీలకు టికెట్లు ఇచ్చి నిందలు వేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనను అవమానించినా… పార్టీ పెద్దలెవరూ ఆయనను వారించలేదన్నారు.ఆర్థికంగా బలంగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వారికే కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇస్తోందని, మధు యాష్కీ లాంటి బీసీ నేతలను కించపరిచేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ  మాటల్లో చెప్పడం తప్ప కాంగ్రెస్ చెబుతున్న సామాజిక న్యాయం అమలు కావడం లేదని ఆరోపించారు.

There is no self respect in that party
There is no self respect in that party
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular