బిజేపి పటాన్ చేరు అభ్యర్థి ప్రకటన పై జాతీయ పార్టీ మరియు రాష్ట్ర పార్టీ పునరాలోచించుకోని అభ్యర్థిని మార్చాలి
అభ్యర్థి ప్రకటన పై అసంతృప్తి వ్యక్తం చేసిన పటాన్ చేరు నియోజకవర్గం లోని 8 మంది మండల, మున్సిపల్ మరియు డివిజన్ అధ్యక్షులు
🔸పటాన్ చేరు నియోజకవర్గం బిజేపి మండల అధ్యక్షులు, మున్సిపల్ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ
🔸పటాన్ చేరు అసెంబ్లీ బిజేపి అభ్యర్థి ప్రకటన పై తాము అంత అసంతృప్తిగా ఉన్నామని తెలియజేశారు, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న వారికి ఎలాంటి కేసులు లేని వారికి ప్రజాఅధరన ఉన్న వారికి కేటాయిస్తే బాగుంటుందని వారు అన్నారు
🔸పూటకో పార్టీ మారుతూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా పార్టీలో ఉన్న నాయకుల పట్ల కార్యకర్తల పట్ల పెత్తనం చెలాయిస్తూ వారిని ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తిని అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారు అని రాష్ట్ర పార్టీని వారు ప్రశ్నించారు

సర్వేలు నిర్వహించి అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత సర్వేల ప్రకారం అభ్యర్థులు ప్రకటన చేయాలి కానీ సర్వేలకు సంబంధం లేకుండా ఏ విధంగా నిర్ణయం తీసుకున్నరో తెలియజేయాలని వారు కోరారు
ఈ కార్యక్రమంలో పటాన్ చేరు మాజీ జెడ్పీటీసీ బిజెపి ఓబీసీ మొర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్,బిజెపి ఓబీసీ మొర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దేవేందర్ గౌడ్, జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యుడు మధుకర్ రెడ్డి,పటాన్ చేరు మండల అధ్యక్షుడు కావలి వీరేశం, పటాన్ చేరు 113 డివిజన్ అధ్యక్షుడు నాగరాజు యాదవ్, రామచంద్రపురం 112 డివిజన్ అధ్యక్షుడు నర్సింగ్ గౌడ్,భారతి నగర్ 111 డివిజన్ అధ్యక్షుడు మన్నె శ్రీకాంత్, తేల్లాపూర్ మున్సిపల్ అధ్యక్షుడు కోటే శంకర్, జిన్నారం మండల అధ్యక్షుడు బండి శ్రీకాంత్ గౌడ్, గుమ్మడిదల మండల అధ్యక్షుడు చింతల యాదగిరి, మరియు వివిధ మోర్చాల అధ్యక్షులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



