గుడిసెలు లేని నియోజకవర్గమే లక్ష్యం..ఎమ్మెల్యే కడియం శ్రీహరి

- Advertisement -

గుడిసెలు లేని నియోజకవర్గమే లక్ష్యం..

• అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు

• గ్రామాల అభివృద్ధికి కోట్ల రూపాయల పనులు..

• గత ఎమ్మెల్యేగా చిల్లర పనులతో నియోజకవర్గ పరువు తీశారు..

• స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

• ధర్మసాగర్ లో కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణి..

A hut-free constituency is the goal: MLA Kadiyam Srihari.

హనుమకొండ జిల్లా,వాయిస్ టుడే: స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని తెలంగాణలోనే గుడిసెలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. పూర్తిగా ఇల్లులేని నిరుపేదలకు రాజకీయాలకు అతీతంగా మొదటి ప్రాధాన్యతగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. సోమవారం ధర్మసాగర్ మండలంలోని ఎల్కుర్తి,జానకిపురం గ్రామాల్లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు,శంకుస్థాపన కార్యక్రమాలకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధిని ఎవరూ పట్టించుకోలేదని విమర్శించారు. ఎల్కుర్తి గ్రామానికి నాలుగు వైపులా ఉన్న బీటీ రోడ్లు తాను ఎమ్మెల్యేగా,మంత్రిగా ఉన్న సమయంలోనే నిర్మించామని,అప్పట్లో వేసిన సింగిల్ రోడ్లను ఇప్పుడు డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. జాతీయ రహదారి నుంచి ఎల్కుర్తి మీదుగా నారాయణగిరి వరకు రూ.18 కోట్లతో డబుల్ రోడ్డు మంజూరైందని,కరుణాపురం నుంచి సోమదేవరపల్లి మీదుగా ఎల్కతుర్తి వరకు రూ.50 కోట్లతో మరో డబుల్ రోడ్డు త్వరలో మంజూరు కానుందని వెల్లడించారు. ఎల్కుర్తి గ్రామంలో నిర్మాణంలో ఉన్న సీసీ రోడ్డు,సైడ్ డ్రైనేజీ పనులను 60 రోజుల్లో పూర్తి చేస్తామని,గ్రామస్తులు సహకరించాలని కోరారు. ఎల్కుర్తి గ్రామంపై తనకు ప్రత్యేక అభిమానం ఉందని పేర్కొన్న ఆయన అసంపూర్తిగా ఉన్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి తక్షణమే నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఏడాదిలోపు గ్రామానికి నాలుగు వైపులా ఉన్న బీటీ రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చి గ్రామ రూపురేఖలను పూర్తిగా మార్చేస్తామని తెలిపారు. జానకిపురం గ్రామాన్ని ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేస్తామని పేర్కొంటూ నారాయణగిరి నుంచి జానకిపురం మీదుగా రాయగూడెం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి త్వరలోనే మంజూరు చేయిస్తామని చెప్పారు. గ్రామ పంచాయతీ భవనానికి నెల రోజుల్లో నిధులు మంజూరు చేస్తామని,ఇప్పటికే రూ.45 లక్షలతో సీసీ రోడ్లు నిర్మించగా, త్వరలో మరో రూ.25 లక్షలతో సీసీ రోడ్లు, అంగన్‌వాడీ భవనం మంజూరు చేస్తామని తెలిపారు.

చిల్లర పనులతో నియోజకవర్గ పరువు తీశారు..

గతంలో 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న నాయకులు అభివృద్ధిని పట్టించుకోకుండా పనులు,పథకాలు,పదవులు అమ్ముకోవడానికే కాకుండా చిల్లర పనులతో నియోజకవర్గ పరువు తీసారని కడియం ఆరోపించారు. ఏనాడూ ఒక్క పని చేయని వారు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని,గత ఎమ్మెల్యే ఏమి చేశాడు.. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఏమి చేస్తున్నాడో ప్రజలు ఆలోచించాలని కోరారు. పని చేసే వారిని,పని చేయని వారిని ఒకేలా చూడవద్దని సూచించారు. నియోజకవర్గాన్ని,గ్రామాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు.

కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణి..

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వ పథకాల అమలు జరగాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. ధర్మసాగర్ మండల కేంద్రంలోని ఎంపిడివో కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణి కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్మసాగర్ మండలానికి సంబందించిన 26మంది కళ్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ లబ్ధిదారులకు 26లక్షల 03వేల 016రూపాయల విలువగల చెక్కులను,అలాగే 39మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు 14లక్షల 25వేల రూపాయల విలువగల చెక్కులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పంపిణి చేశారు.ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన భూక్య వసంత అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం 2లక్షల 50వేల రూపాయల ఎల్ఓసి ని మంజూరు చేయించి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. అలాగే ముప్పారం గ్రామంలో రెండు అంగన్వాడీ భవనాల నిర్మాణానికి మంజూరు పత్రాన్ని స్థానిక సర్పంచ్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు,వివిధ శాఖల అధికారులు,తహసీల్దార్ బావుసింగ్,ఎంపీడీవో,ప్రజాప్రతినిధులు,మండల నాయకులు,కార్యకర్తలు,గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular