నా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలందరికి విజయదశమి శుభాకాంక్షలు – కుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్..
కుత్బుల్లాపూర్ వాయిస్ టుడే ( అక్టోబర్ 23) : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు కాలనీలలో ఆదివారం జరిగిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు, సద్దుల బతుకమ్మ వేడుకలకు మాజీ ఎమ్మెల్యే, కుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ హాజరై, అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేసారు. పలు కాలనీల్లో అమ్మ వారి మండపాలకు పూజలు చేసిన ఆయన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలందరూ అమ్మ వారి దయతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా ప్రజలందరికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే తొమ్మిదేళ్ల దుష్ట పాలనకు అంతం ఈ విజయదశమి నుండే ప్రారంభం కానుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు, పలు కాలనీల సంక్షేమ సంఘాల సభ్యులు ఉన్నారు.



