Wednesday, March 25, 2026

మేడిగడ్డలో లోపం ఎవరిది…

- Advertisement -

వరంగల్, అక్టోబరు 25, (వాయిస్ టుడే): తెలంగాణ ప్రభుత్వం దాదాపు రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీ​ ప్రమాదంలో పడింది. బ్యారేజీ మూడో బ్లాక్​లోని పిల్లర్లు శనివారం రాత్రి కుంగిపోయాయి. దాదాపు 85 గేట్లు, 16 టీఎంసీల కెపాసిటీతో ఈ బ్యారేజీని నిర్మించగా.. 19, 20, 21 నెంబర్​ పిల్లర్లు కుంగిపోయి గేట్ల నుంచి భారీ శబ్దం వచ్చింది. దీంతో అక్కడి సిబ్బంది అలర్ట్​అయి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. బ్యారేజీ మీదుగా తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిపేశారు. శనివారం రాత్రి వరకు బ్యారేజీలో దాదాపు 10 టీఎంసీల నీళ్లు ఉండగా.. ఇరిగేషన్​ ఆఫీసర్లు అక్కడకు చేరుకుని గేట్లను ఎత్తి నీటికి ఖాళీ చేయడం ప్రారంభించారు. కాగా ఆదివారం ఉదయం ఇంజినీరింగ్​ ఆఫీసర్లు కుంగుతున్న బ్యారేజీ పిల్లర్లను పరిశీలించారు. అనంతరం ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. నిర్మాణ లోపమా.. మరేదైనా కారణమా? అని విశ్లేషించే పనిలో పడ్డారు. ఇదిలా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలను వివరిస్తూ హైకోర్టు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్​చీఫ్​ జస్టిస్​కు లేఖ రాశారు.మేడిగడ్డ ప్రమాదంపై అధికారికంగా స్పందించని అధికారులు.. వివరాలు వెల్లడించకుండా గోప్యత పాటిస్తున్నారు. బ్యారేజీ వద్దకు మీడియా, ప్రతిపక్ష నాయకులు వెళ్లకుండా పోలీస్​ బందోబస్తు ఏర్పాటు చేశారు. అటువైపుగా ఎవరూ వెళ్లకుండా పోలీసులు కట్టుదిట్టంగా ఐరన్​ గేట్​అమర్చారు. మీడియా, ప్రతిపక్షాలను అనుమతించకపోవడంతో బ్యారేజీ భద్రత విషయంలో అనుమానాలు బలపడుతున్నాయి

కుట్ర కోణం లో  కంప్లయింట్

మేడిగడ్డ బ్యారేజీని కేంద్ర జలవనరుల శాఖ ప్రతినిధులు మంగళవారం పరిశీలించారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రతినిధులు నిచ్చెనల ద్వారా కిందకు దిగి కుంగిన పిల్లర్లను పరిశీలించారు. సుమారు 2 గంటలకు పైగా అధికారులు పిల్లర్లను పరిశీలించారు. మేడిగడ్డ వంతెన కుంగిన ఘటనపై కేంద్ర జలశక్తి శాఖ ఆరుగురు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసింది. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌ అనిల్‌ జైన్‌ నేతృత్వంలో ఈ నిపుణుల కమిటీ మంగళవారం బ్యారేజ్‌ను పరిశీలించింది. 20వ పిల్లర్ వద్ద పగుళ్లకు కారణాలు, బ్యారేజ్‌ సేఫ్టీ, ప్రస్తుతం జరిగిన నష్టంపై కమిటీ అంచనా వేస్తుంది. ఈ ఘటనపై సమగ్ర పరిశీలన తర్వాత నిపుణుల కమిటీ కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక అందించనుంది. కేంద్ర బృందం వెంట కాళేశ్వరం ఈఎన్సీ వెంకటేశ్వర్లు, ఎల్ అండ్ టీ ప్రతినిధులు ఉన్నారు.మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడంతో డ్యామ్ లోని నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం బ్యారేజీలో నీటి మట్టం కనిష్ఠ స్థాయికి చేరింది. బ్యారేజ్‌ 57 గేట్ల ద్వారా 22,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెట్టినట్లు అధికారులు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ పిల్లర్లు శనివారం కొంతమేరకు కుంగిపోయాయి. బి-బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న వంతెన భారీ శబ్దంతో కుంగింది. దీంతో వంతెనపై రాకపోకలను నిలిపివేశారు. మేడిగడ్డ బ్యారేజీ పొడవు 1.6 కిలోమీటర్లు కాగా, పిల్లర్లు కుంగిన ప్రదేశం మహారాష్ట్ర వైపు నుంచి 356 మీటర్ల సమీపంలో ఉందని అధికారులు తెలిపారు. కాంక్రీట్‌ నిర్మాణంతో ఉన్న పియర్‌ కుంగడంతోనే భారీ శబ్దం వచ్చిందని ఇంజినీర్లు అంటున్నారు. గోదావరిపై ఉన్న ఈ బ్యారేజీకి ఒకవైపు తెలంగాణ, మరోవైపు మహారాష్ట్ర ఉన్నాయి.రాష్ట్ర ప్రభుత్వ అధికారులు బ్యారేజీ డిజైన్‌ చేసి ఇచ్చారని, దీనిని మా సంస్థ నిర్మించిందని ఎల్ అండ్ టీ తెలిపింది. వరద నీరు విడుదల సామర్థ్యం 28.25 లక్షలకు అనుగుణంగా డ్యామ్ నిర్మించామన్నారు. బ్యారేజీకి ఎటువంటి ప్రమాదం లేదని ఆ సంస్థ ప్రతినిధులు అంటున్నారు

సెంట్రల్ గ్రావిటీ తప్పడం..

పైపింగ్ యాక్షన్ తో డ్యామ్ లో పగుళ్లు

ఎన్ఎస్డీయే ప్రధామిక అంచనా

వరంగల్: కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ ను నేషనల్ డామ్ సేఫ్టీ అథారిటి (ఎన్డీఎస్యే)మంగళవారం పరిశీలించింది. బుధవారం నాడు హైదరాబాద్ లో ఉన్నత స్థాయి  సమావేశం లో పాల్గోంది. 7వ బ్లాక్ లోని 20 వ పియర్ వర్టికల్ క్రాక్ ఏర్పడినట్లు అధికారులు గుర్తించారు. ఆ ప్రభావం 19,21..పియర్లపై పడే అవకాశం వుందని సమావేశం. రిపేర్ చేయడానికి ఆరునెలలు పట్టే అవకాశం వుందడంతో  నీటిని దారి మళ్లించడానికి  కాఫర్” నిర్మాణం, ఏడో బ్లాక్ లో నీటిని తీసివేయడానికి మేయున్ కింద నిర్మాణం చేయాలని బృందం  ప్రాథమిక అంచనావేసినట్లు సమాచారం. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఏవిధమైన డిజైన్ ఇచ్చింది. నిర్మాణ కంపెనీ ఏధంగాదంగా నిర్మించిందదో పరిశీలించింది. సెంట్రల్ గ్రావిటీ తప్పడం వల్ల ఏర్పడ్డ పైపింగ్ యాక్షన్ వల్ల డామ్ కు ప్రమాదం జరిగిందనేది ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు సమాచారం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్