బెంగళూరు:అక్టోబర్ : ఐసీసీ వన్డే ప్రపంచ కప్ లో భాగంగా ఇవ్వాల గురువారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇంగ్లండ్- శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో శ్రీలంక ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ జట్టును కనీసం 200 పరుగులు కూడా చేయనివ్వకుండా ఆలౌట్ చేసింది.
శ్రీలంక టీమ్. దీంతో ఇంగ్లండ్ జట్టు 33.2 ఓవర్లలో 156 పరుగులకే పరిమితం అయింది. చేజింగ్ లో 26 ఓవర్లలోనే 8 వికెట్ల తేడాతో మ్యాచ్ ను ముగించేసింది శ్రీలంక జట్టు.
లంక బ్యాటర్లలో పాతుమ్ నిస్సాంక 77 పరుగులు (నాటౌట్), సదీరా సమర విక్రమ 65 పరుగులు (నాటౌట్) సూపర్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లే కి మాత్రమే రెండు వికెట్లు దక్కాయి.
మిగతా బౌలర్లు నిరాశపర్చారు. శ్రీలంకకు ఇది రెండో విజయం కాగా.. ఇంగ్లండ్ జట్టుకు నాలుగో ఓటమి. ఈ ఓటమితో ఇంగ్లండ్ సెమీస్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి.