స్టేట్ బెస్ట్ క్రైం రిపోర్టర్ కేటగిరీ లో అవార్డును అందుకున్న క్రైం బ్యూరో చీఫ్ భాస్కర్
మున్నూరు కాపు కులస్థుల అభినందలు
గంభీరావుపేట అక్టోబర్ 28 (వాయిస్ టుడే ప్రతినిధి):

శనివారం రోజు హైదరాాదులోని గచ్చిబౌలి టి హబ్ లో ఐ టి టీవీ గ్లోబల్ మీడియా బిజినెస్ అవార్డుల వేడుకలు కన్నుల పండువగా జరిగాయి.స్టేట్ బెస్ట్ క్రైం రిపోర్టర్ కేటగిరీ లో అవార్డును గంభీరావుపేట కు చెందిన అక్కపల్లి భాస్కర్ టి న్యూస్ క్రైం బ్యూరో చీఫ్ అందుకున్నారు. ఈ అవార్డు ను అందుకోవడం పట్ల గంభీరావుపేట మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు నాయకులు సభ్యులు అభినందనలు తెలియజేశారు. విభిన్న రంగాలలో విశేషంగా కృషి చేస్తున్న రాణిస్తున్న వారికి అవార్డు లను ఐ టి టీవీ వారు ఐ కాన్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో అందించడం జరుగుతోంది.నలుబైకి పైగా కేటగిరిలకు చెందిన వారికి అవార్దు లు దక్కాయి ఈ అవార్డు ను అందుకోవడం పట్ల గంభీరావుపేట మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు కూర సురేష్, వాయిస్ టుడే ప్రతినిధి కస్తూరి శ్రీనివాస్ నాయకులు గంట అశోక్, శ్రీనివాస్ ,బోయాన్నగారి శ్రీనివాస్, జిల్లెల్ల పర్షురములు,అక్కపల్లి బాలయ్య,గంద్యాడపు రాజు, మేకర్తి మల్లేశం,చిట్టంపల్లీ బిక్షపతి, బి రాజు
వెల్డింగ్ షాప్ సభ్యులు అభినందనలు తెలియజేశారు.



