కాంగ్రెస్ రెండో విడత విజయభేరీ  బస్సు యాత్ర

- Advertisement -

మెదక్ జిల్లా: తెలంగాణలో రెండో విడత కాంగ్రెస్ విజయభేరీ బస్సు యాత్ర ఆదివారం మెదక్ పార్లమెంట్ పరిధిలో  జరిగింది. ఈ యాత్రలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తదితరులు హాజరు.. మధ్యాహ్నం 2 గంటలకు సంగారెడ్డిలోని గంజ్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు.

Second phase of Congress bus trip to Vijayabheri
Second phase of Congress bus trip to Vijayabheri

 

తెలంగాణలో రెండో విడత కాంగ్రెస్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారైంది. ఆదివారం నుంచి నవంబర్ 1వ తేదీ వరకు రెండో విడత బస్సు యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య పాల్గొననున్నారు. ఈరోజు బస్సు యాత్రలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య పాల్గొననున్నారు. 30, 31 తేదీల్లో ప్రియాంక గాంధీ.. వచ్చే నెల 1న బస్సుయాత్రలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో బస్సు యాత్ర సాగేలా తెలంగాణ పీసీసీ ప్లాన్ చేసింది. ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో రెండో విడత బస్సు యాత్ర సాగనుంది..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular