సికింద్రాబాద్, అక్టోబర్ 30(వాయిస్ టుడే ప్రతినిధి): ఒకరికి ఒకరు తోడుగా నిలిచినప్పుడే ప్రేమైక సమాజం సాధ్యపడుతుందని అరునోదయ ఓల్డ్ ఏజ్ చైర్మన్ తాళ్ల లావణ్య పేర్కొన్నారు. సమాజంలో అనాధలకు, నిరుపేదలకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఆమె సూచించారు. సోమవారం నగరానికి చెందిన సాఫ్ట్వేర్ దంపతులు అయిన సుదీర్ దివ్య ల కూతురు ఆద్య జన్మదిన వేడుకలను తార్నాకలోని అరుణోదయ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఘనంగా నిర్వహించారు. వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి, నిరుపేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ అనాధ వృద్ధుల పట్ల జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషకరమన్నారు. ఒకరికి తోడ్పడడంలో ఉన్న ఆనందం ఎక్కడ దొరకదని చెప్పారు. కార్యక్రమంలో సరుకులు అందించిన సహాయకులు సతీష్, రాజు, హోం సెక్రటరీ చిన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు.



