సిపిఐ సికింద్రాబాద్ కార్యదర్శి కాంపల్లి శ్రీనివాస్
సికింద్రాబాద్ అక్టోబర్ 30 (వాయిస్ టుడే ప్రతినిధి): అడ్డగుట్టను సమస్యలగుట్ట గా మార్చింది బిఆర్ఎస్ పార్టీ అని, నేటికీ అడ్డగుట్టలో మౌలిక సదుపాయాలు కరువయ్యాయని
అడ్డగుట్ట డివిజన్ సిపిఐ ముఖ్య కార్యకర్తల సమావేశం శ్రామిక భవన్ సిపిఐ కార్యాలయంలో సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంపల్లి శ్రీనివాస్ అన్నారు. కార్యక్రమానికి గౌరీ నాగరాజు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా సిపిఐ సికింద్రాబాద్ కార్యదర్శి కాంపల్లి శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ…
అడ్డగుట్ట పాలకవర్గాల నిర్లక్ష్య మూలాన ‘సమస్యలగుట్ట’గా మారిందని, నాయకులు మారిన అడ్డగుట్ట సమస్యలు మాత్రం తీరట్లేదని అన్నారు.
ఎన్నో పోరాటాలతో ఏర్పడిన అడ్డగుట్ట నేటికీ కనీస మౌలిక సదుపాయాలు లేక అడ్డగుట్ట ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. అడ్డగుట్టలోని ఏ,బి,సి సెక్షన్లలో రోడ్లు,డ్రైనేజీ,మంచినీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చేపట్టాలని అనేకమార్లు సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించినప్పటికీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు, కార్పొరేటర్ పట్టించుకోలేదని అటువైపు కూడా చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కేవలం ఎన్నికల ముందు మాత్రమే పాదయాత్రలు పర్యటనలు చేసి, ఉత్తుత్తి హామీలతో ప్రజలను ఓట్ల కోసం మభ్య పెడుతున్నారనీ, డివిజన్ అభివృద్ధిపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని అన్నారు.
ప్రజా సమస్యలను గాలికి వదిలేసి అడ్డగుట్టను ‘సమస్యలగుట్ట’గా మార్చిన బీఆర్ఎస్ పార్టీ నీ జరగబోయే ఎన్నికలలో నియోజకవర్గ ప్రజలంతా విచక్షణతో ఆలోచించి ఓటుతో బుద్ధి చెప్పాలని చిత్తుగా ఓడించేందుకు విస్తృతంగా కృషి చేయాలని సూచించారు.
లేకపోతే అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో
సిపిఐ సికింద్రాబాద్ సహాయ కార్యదర్శి కొమరెల్లి బాబు, అడ్డగుట్ట డివిజన్ కార్యదర్శి పాకాల యాదగిరి, శంకర్, కాసిం, రామస్వామి, బాలరాజ్, సాయిలు, రాంచందర్, యాదగిరి, రాములు, ఎల్లయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.



