ఎల్బీనగర్, వాయిస్ టుడే: మహేశ్వరం నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా కొత్త మనోహర్ రెడ్డి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని ఎస్.వై.ఆర్.గార్డెన్లో సోమవారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మహేశ్వరం నియోజకవర్గం ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కార్యకర్తలు, అభిమానులు జిల్లెలగూడ నుండి గార్డెన్ వరకు భారీగా ర్యాలీతో బయలుదేరి వచ్చారు. ఈ సందర్భంగా కొత్త మనోహర్ రెడ్డి మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ ముందు వరుసలో ఉన్నానని తెలిపారు. 3వేల మందికి 60 గజాల చొప్పున ఇళ్ళ స్థలాలు ఇప్పించడం జరిగిందన్నారు. మహేశ్వరం నియోజకవర్గమే కాకుండా బయటివారు వచ్చి మహేశ్వరం నియోజకవర్గం లో పోటీ చేస్తున్నారని మండిపడ్డారు. మహేశ్వరం నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలని కోరారు. పేద ప్రజలకు డబుల్ బెడ్ రూములు, ఇళ్లు, స్థలాలు ఇవ్వలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో కె.ఎం.ఆర్. సభ్యులు కార్యకర్తలు గుల్ల సంతోష్ కుమార్ ముదిరాజ్, కామోజీ తిరుపతయ్య, భిక్షపతి, ఎర్ర శంకరయ్య, నర్సింగ్, లింగమయ్య, ఆలేటి శ్రీకాంత్, వినయ్, రాజు, శంకరయ్య, కార్తీక్ రెడ్డి, కుమార్, సురేష్, శ్రీనివాస్, మధు, భాస్కర్, సీనన్న, రాములు, కుర్మయ్య, కురుమూర్తి, మొగులయ్య, డప్పు కూర్మయ్య, దర్శన్, ఆశీర్వాద్, వరుణ్, పవన్, శేఖర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
మహేశ్వరం స్వతంత్ర అభ్యర్థిగా కొత్త మనోహర్ రెడ్డి
Published By Voice Today Team
285
- Advertisement -
- Advertisement -



