బోయినపల్లి లో బి ఆర్ ఎస్ నాయకుల విస్తృత ప్రచారం. ఇంటింటికి తిరుగుతూ సుంకే రవిశంకర్ ను గెలిపించాలని ప్రచారం

- Advertisement -
Extensive campaigning by BRS leaders in Boinapally. Campaigning to win Sunke Ravi Shankar by going door to door

.
వాయిస్ టుడే ప్రతినిధి బోయినపల్లి అక్టోబర్ 30
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్ రావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ శ్రేణులు చొప్పదండి ఏం ఎల్ ఏ గ సుంకే రవి శంకర్ ను గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను ఇంటింటికి తిరుగుతూ వివరించారు. నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సుంకే రవిశంకర్ ను గెలిపించాలని ఓటర్లను కోరారు.తెలంగాణ వచ్చిన తరువాత గ్రామాలు సస్యశ్యామలం అయ్యాయని,24 గంటల విద్యుత్,రైతు బీమా,రైతు బందు పథకాల తో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టింది అని తెలిపారు.మళ్లీ కేసీఆర్ ను ముఖ్యమంత్రి నీ చేయాలంటే సుంకే రవి శంకర్ ను గెలిపించాలని కోరారు.కాంగ్రెస్ ,బిజెపి నాయకుల మాటలు నమ్మవద్దని వారి మాటలు మొత్తం మోస పూరితపు మాటలు తప్ప ఎలాంటి అభివృద్ధి జరగదని అన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి ప్రేమ్ సాగర్ రావు ,ఉమ్మడి జిల్లా మాజీ డీసీఎం చైర్మన్ ముదిగంటి సురేందర్ రెడ్డి ,ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య , వైస్ ఎంపిపి కొనుకటి నాగయ్య,డాక్టర్ అమిత్ కుమార్, రైతుబంధు సమితి అధ్యక్షులు కోనుకటి లచ్చి రెడ్డి, సేస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు ,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular