
*నాదర్ గుల్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కార్తీక్ రెడ్డి
ఎల్బీనగర్, వాయిస్ టుడే:
రాబోయే ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి కోరారు. మహేశ్వరం నియోజకవర్గం నాదర్ గుల్ గ్రామంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మంగళవారం కార్తీక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధి కోసం నాడు సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారారని, ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చారని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగాన్ని నిలిపేందుకు సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. మహేశ్వర నియోజకవర్గంలోనే నాదర్ గుల్ కు ప్రత్యేక స్థానం ఉందని, ఆ స్థానాన్ని ఎప్పుడూ పదిలంగా ఉంచుకుంటామని అన్నారు. అంతకుముందు వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలకు పార్టీ కండువాలను కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మమతా సుదర్శన్ రెడ్డి, రాముడి రాంరెడ్డి, మర్రి జగన్మోహన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, లాలయ్య, కోటగిరి జంగయ్య, కుమార్ గౌడ్, పన్నాల కృష్ణారెడ్డి, దండు యాదయ్య, మల్లేష్ యాదవ్, సుదర్శన్, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.



