Monday, March 16, 2026

ఎస్జిఎఫ్  రాష్ట్ర స్థాయి కరాటే పోటీలకు మంథని షోటోకాన్ క్రీడాకారులు ఎంపిక

- Advertisement -

మంథని: స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్  రాష్ట్ర స్థాయి కరాటే పోటీలకు మంథని షోటోకాన్ క్రీడాకారులు ఎంపికయ్యారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎన్.టి.పి.సి, టి.వి గార్డెన్ లో  ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ కరాటే ఎంపిక పోటీలను నిర్వహించారు. ఈ సెలక్షన్స్ కి ముఖ్య అతితులుగా పెద్దపల్లి జిల్లా ఎస్ జి ఫ్ సెక్రెటరీ కోమురోజు శ్రీనివాస్, ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ మానస అనుతం రెడ్డిలు హాజరయ్యారు. విద్యార్థిని విద్యార్థులు చదువుతో పాటు కరాటే నేర్చుకోవటం వల్ల ధైర్యంతో పాటు భవిష్యత్తులో ప్రభుత్వ, ప్రైవేటు ఉధ్యోగాలు వస్తాయి అని చెప్పారు. ఉమ్మడి జిల్లా సెలక్షన్స్ కు కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల నుండి 200 కరాటే క్రీడాకారులు పాల్గొన్నారు. మంథని షోటోకాన్ కరాటే మాస్టర్ కోoడ్ర నాగరాజు ఆధ్వర్యంలోని విధ్యారులు ముగ్గురు రాష్ట్ర స్థాయి కరాటే పోటీలకు ఎంపిక అయ్యారు.
అండర్ 17-35 కెజిల విభాగంలో లో బీర ఆదిత్య తేజ ( గోల్డ్ ), – 52 కెజి విభాగంలో దొంతుల సాయి దివ్య తేజస్విని ( గోల్డ్ ),  అండర్ 14, – 42 కె.జి విభాగంలో  వడ్లకొండ శ్రీనిత ( గోల్డ్ ), – 25 కెజి లో పి.శ్రీరాజ్  ( సిల్వర్) మెడల్స్ సాధించారు.
నల్గొండ లో జరగబోయే రాష్ట్ర స్థాయి  కరాటే లో వీరు పాల్గొననున్నారు.  ఈ పోటీలకు ఎంపికైన అయిన విద్యార్థులను, మాస్టర్ కోoడ్ర నాగరాజు లను జేకెఏ  సౌత్ జోన్ ఇంఛార్జి రాపోలు సుదర్శన్, జోనల్ ఇంఛార్జి నూకల బానయ్య, సీనియర్ మాస్టర్స్ పర్ష బక్కయ్య, శంకర్ గౌడ్ లు అభినందించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్