
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీలో చేరిన మిత్రులందరికీ స్వాగతమని సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం నాడు కాంగ్రెస్ నేతలు .నాగం జనార్దన్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి బీఆర్ ఎస్ లో చేరారు. వారికి ముఖ్యమంత్రి కండువా కప్పి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ జైలుకు వెళ్లిన చరిత్ర నాగం ది. నాగం చేరికతో బలం పెరిగింది. పాలమూరు లో పద్నాలుగుకు పద్నాలుగు సీట్లు గెలవడం ఖాయం అయ్యిందని అన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి మంచి రాజకీయ భవిష్యత్ కు నాది భాద్యత. పీజేఆర్ నాకు మంచి మిత్రుడు ..ఆయన కుమారుడు విష్ణు నా కుటుంబ సభ్యుడి లాంటి వాడే. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ,విష్ణు పాత కొత్త అనే తేడా లేకుండా సమన్వయం తో పని చేసుకోవాలి. .నాగం ఇంటికి త్వరలో నేనే స్వయంగా వెళ్లి మరోసారి ఆయన వెంట వచ్చిన కార్యకర్తలను కలుసుకుంటా. తెలంగాణ బ్రహ్మాండమైన పురోగతి తో ముందుకు సాగుతోంది. తలసరి ఆదాయం పెరిగింది ..24 గంటల కరెంటు దేశం లో మరెక్కడా లేదు. అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. .నిన్న ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి ని చంపాలని చూశారు. .దేవుడి దయ వల్ల ప్రభాకర్ రెడ్డి బ్రతికి బయట పడ్డాడు. .ఇలాంటి హత్య రాజకీయాలు సహించేది లేదు. .హింసాత్మక చర్యలు ఎవరు చేసినా ఉపేక్షించమని అన్నారు.




