- Advertisement -
తూప్రాన్: పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు కామారెడ్డి వెళుతున్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు వాహనాన్ని పోలీసులు, ఎన్నికల సిబ్బంది తనిఖీ చేశారు. తూప్రాన్ వద్ద మంత్రి వాహనాన్ని ఆపడంతో కేటీఆర్ కారు దిగి దూరంగా నిలబడ్డారు. తన వాహన తనిఖీ పూర్తి అయ్యేవరకు వుండి తరువాత కామారెడ్డి బయలుదేరారు.
- Advertisement -



