Sunday, May 24, 2026

వ్యక్తిగత ఆరోపణలతో కాంగ్రెస్ అధికారంలోకి రాదు రాబోదు

- Advertisement -

మంత్రి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, మాజీ సాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి పాల్గోన్నారు.
మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి రైతులు బిచ్చగాళ్లలా కనిపిస్తున్నారా . కొల్లాపూర్ సభలో కాంగ్రెస్ వ్యాఖ్యలు హస్యాస్పదం, గర్హనీయమని ఆరోపించారు. కృష్ణా నీళ్లను కిందకు పంపి పాలమూరును ఎండబెట్టింది మీరు. ఎత్తిపోసి రైతుల పొలాలకు కంపించింది బీఆర్ఎస్ పార్టీ. రైతుబంధు, రైతుభీమా పథకాలు ప్రపంచంలోనే అత్యుత్తమమైనవని అంతర్జాతీయ సంస్థలు ప్రశంసలు కురిపించాయి. రైతుబంధు బిక్షం అని కాంగ్రెస్ చెబుతున్నది.
కాంగ్రెస్ పాలనలో రైతులు అప్పుంటే ఇంటికి వెళ్లి తలుపులు పీక్కోని వచ్చేదని అన్నారు. దేశంలో, ప్రపంచంలో నేరుగా రైతుల ఖాతాల్లో రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి ఏడాదికి రూ.10 వేల చొప్పున ఇప్పటి వరకు 11 విడతలలో రూ.72 వేల 815 కోట్లు జమచేసిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. రైతు భీమా పథకం ద్వారా ఇప్పటివరకు 1,11,320 మంది రైతు కుటుంబాలకు  రూ. 5,566 కోట్ల  భీమా పరిహారం అందేలా చేసిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. రైతుబంధు, రైతుభీమా పథకాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా తెలంగాణ తరహా పథకాలు లేవు. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఈనాటి వరకు రూ. లక్షా 33 వేల కోట్లతో, 722.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది తెలంగాణ ప్రభుత్వం. అలాగే ధాన్యం కాకుండా రూ.11,439.06 కోట్లతో ఇతర పంటల సేకరించింది. రూ. 5349 కోట్లతో మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరించి,     8.93 టిఎంసి ల సామర్థ్యంతో 15.05 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగిందని అన్నారు. రాహుల్ గాంధీ నియోజకవర్గానికి ఒక సభ పెట్టినా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాదు. నిందారోపణలు, వ్యక్తిగత ఆరోపణలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు రాబోదు. తెలంగాణలో జరిగిన అభివృద్ది రాహుల్ గాంధీకి కనిపించడం లేదా.  ఒక జాతీయ పార్టీ నేతగా రాహుల్ మాట్లాడాల్సిన మాటలేనా అని నిలదీసారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్