Sunday, May 24, 2026

టైలరింగ్ శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్ల పంపిణీ

- Advertisement -

సంఘమిత్ర అధ్యక్షులు సోద్దల పెంచలయ్య

బద్వేలు:  బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో సంఘమిత్ర స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బద్వేల్ పట్టణంలోని సంఘమిత్ర కార్యాలయంలో టైలరింగ్ శిక్షణ పొందిన మహిళలకు ఉచితంగా శిక్షణ ఇచ్చి టైలరింగ్ సర్టిఫికెట్లు పంపిణీ చేసిన కార్య  క్రమంలో కడప జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ హనుమంతు వెంకటసుబ్బయ్య సగర కార్పొరేషన్ స్టేట్ చైర్మన్ గానుగపెంట రమణమ్మ మహిళలకు టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ నిరుద్యోగ మహిళలకు చేతివృత్తుల ద్వారా ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదల అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు  సంఘమిత్ర సంస్థ  చేస్తున్న శిక్షణల ద్వారా మహిళలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు

ఆంధ్రప్రదేశ్ సగర కార్పొరేషన్ చైర్మన్ గానుగపెంట రమణమ్మ వైసిపి సీనియర్ నాయకులు గానుగ పంట బంగారు సీనయ్య మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి స్వచ్ఛంద సేవా సంస్థలు చేస్తున్న సేవలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం  మహిళల అభ్యున్నతికి ప్రభుత్వ సంక్షేమ సంఘం పలు  పథకాలు ప్రవేశపెట్టి మహిళల అభివృద్ధికి కృషి చేస్తుందని వారు తెలిపారు సంఘమిత్ర సమస్త చైర్మన్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినందుకు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అందులో భాగంగా 70 మంది నిరుద్యోగ మహిళలకు టైలరింగ్ శిక్షణ ఏర్పాటు చేసి మూడు నెలల పాటు శిక్షణ పూర్తి చేసిన వారికి టైలరింగ్ సర్టిఫికెట్లు 35 మందికి పంపిణీ చేశామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి బి గురుమూర్తి, ఆవాజ్ కమిటీ అధ్యక్షులు ఎస్ఏ సత్తార్, బాస్ సొసైటీ అధ్యక్షులు యోహాను, పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి నాయకుడు పిచ్చయ్య, అంబేద్కర్ భవన అధ్యక్షులు మురళి, ఉపాధ్యక్షులు సామెల్, టైలరింగ్ శిక్షణ కోఆర్డినేటర్ జహీరా, సుధామణి ,  ఎన్జీవోలు ఎర్రంపల్లి రవి, ఓ ఎస్ వి ప్రసాద్ తోపాటు అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్